Health

నల్ల గోధుమ పిండితో చపాతీలు చేసి తింటే క్యాన్సర్, మధుమేహం సమస్యలు జీవితంలో రావు.

మ‌ధుమేమం వ్యాధి గ్ర‌స్తుల‌కు న‌ల్ల గోధుమ‌ల ఓ అద్భుత‌మైన వ‌రం అని చెప్పొచ్చు.అవును, వైట్ రైస్‌కు బ‌దులుగా న‌ల్ల గోధుమ‌ల‌తో త‌యారు చేసిన రొట్టెల‌ను చేసుకుని తీసుకుంటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి. న‌ల్ల గోధుమ‌ల్లో ఐర‌న్ కంటెంట్ పుష్క‌లంగా ఉంటుంది.అందు వ‌ల్ల, ర‌క్త హీన‌త‌తో బాధ ప‌డే వారు త‌మ డైట్‌లో గోధుమ‌ల్లో తీసుకుంటే ర‌క్త వృద్ధి జ‌రుగుతుంది. అయితే ఈ రోజుల్లో మార్కెట్‌లో రకరకాల కూరగాయలు దొరుకుతాయి. పర్పుల్ క్యాబేజీ, బ్లాక్ రైస్, అనేక ఇతర రకాల హైబ్రిడ్ కూరగాయలు అందుబాటులోకి వచ్చాయి.

అలాంటివి శరీరానికి సాధారణ కూరగాయల కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మీరు చాలా రకాల గోధుమలను చూసి ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా బ్లాక్ గోధుమల గురించి విన్నారా? సాధారణ గోధుమల కంటే నల్ల గోధుమలు ఎక్కువ ప్రయోజనకరమైనవి. నల్ల గోధుమలలో ఆంథోసైనిన్ వర్ణద్రవ్యం కారణంగా, దాని రంగు ముదురు రంగులో ఉంటుంది.

సాధారణ గోధుమలలో దాదాపు 5 ppm ఆంథోసైనిన్ ఉంటుంది. అయితే నల్ల గోధుమలలో 100 నుండి 200 ppm ఉంటుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సాధారణ గోధుమల కంటే నల్ల గోధుమలో 60 శాతం ఎక్కువ ఐరన్‌ ఉంటుంది. బ్లాక్ వీట్ ప్రయోజనాలు.. బ్లాక్ వీట్ గుండె, క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సాధారణ గోధుమలతో పోలిస్తే, జింక్ పరిమాణం తగినంత ఉంటుంది.

దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. నేటి ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణంలో కీళ్ల నొప్పులు వేగంగా పెరుగుతున్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్లాక్‌ వీట్‌ ఔషధ గుణాలు మోకాలి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇది రక్తహీనత సమస్యను కూడా నయం చేస్తుంది.

ఈ గోధుమలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఈ గోధుమల లాభదాయకత దృష్ట్యా, దీనిని ‘రైతుల నల్ల బంగారం’ అంటారు. మార్కెట్‌లో దీని ధర సాధారణ గోధుమల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. నల్ల గోధుమలను అక్టోబర్-నవంబర్ నెలలలో పండిస్తారు. దీని సాగు ఖర్చు చాలా తక్కువ. ఈ గోధుమలను పండించే రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker