పురుషులకి నల్ల ఖర్జూరం ఒక అద్భుతమైన వరం, ఆ సమయంలో తింటే మాత్రం..?
ఈ సీజన్లో ఖర్జూర పండ్లను తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్లో వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి చలి కాలంలో వీటిని తినడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ముఖ్యంగా ఈ ఎండు ఖర్జూర స్త్రీల కంటే పురుషులకు చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే ఈ సీజన్లో జలుబు, జ్వరం బాధితులు ఎక్కువగా ఉంటారు. అందుకే రోగ నిరోధక శక్తిని బలపరిచే ఆహారాలని డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా పురుషులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. ఆహారంలో నల్ల ఖర్జూరాన్ని చేర్చుకోవాలి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఖర్జూరంలో కాల్షియం, ఫైబర్, ఐరన్, అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పురుషులకు వరం కంటే తక్కువేమి కాదు. ఇది శారీరక బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే చలికాలంలో పురుషులు తప్పనిసరిగా బ్లాక్ డేట్స్ తీసుకోవాలి. బలహీనత తొలగింపు.. చలికాలంలో పురుషులు నల్ల ఖర్జూరాన్ని తీసుకుంటే శరీర బలహీనత తొలగిపోతుంది.
బరువు కూడా వేగంగా తగ్గుతారు ఇది శరీరాన్ని దృఢంగా చేస్తుంది శక్తిని పెంచుతుంది. నల్ల ఖర్జూరాలు పురుషుల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కండరాలు దృఢం.. మీరు శరీరాన్ని దృఢంగా మార్చుకోవాలనుకుంటే నల్ల ఖర్జూరాలను ఆహారంలో చేర్చుకోండి. నల్ల ఖర్జూరంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని నిర్మించడంలో బాగా సహాయపడుతాయి.
ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరం ఉక్కులా మారుతుంది. లైంగిక ఆరోగ్యానికి మేలు.. ఖర్జూరాన్ని రోజూ తీసుకోవడం వల్ల పురుషులలో లైంగిక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు స్టామినా అధిగమవుతుంది. అందుకే పురుషులు తప్పనిసరిగా బ్లాక్ డేట్స్ తీసుకోవాలి. వీటివల్ల సంతాన సమస్యలు పరిష్కారమవుతాయి.