Health

ఈ విషయాలు తెలిస్తే ఈ కాలంలో ఖచ్చితంగా బ్లాక్ క్యారెట్ తింటారు.

ముదురు రంగులో ఉండే ఈ కూరగాయలను ప్రజలు చాలా ఇష్టపడతారు. నల్ల క్యారెట్ రంగు ప్రధానంగా ఆంథోసైనిన్స్ యొక్క అధిక మొత్తం కారణంగా ఉంటుంది. మరోవైపు, నారింజ , పసుపు క్యారెట్‌లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. బ్లాక్ క్యారెట్ రుచి ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఆంథోసైనిన్ బ్లాక్ క్యారెట్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బ్లాక్ క్యారెట్.. రక్తాన్ని శుభ్రపరచి మలినాలు తొలగించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. క్యారెట్ జ్యూస్ శరీరంలో రక్త పరిమాణాన్ని పెంచుతుంది.

బ్లాక్ క్యారెట్‌లోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. నల్ల క్యారెట్ మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం, గుండెల్లో మంట, అలసట, విరేచనాలు వంటి వ్యాధులను నయం చేస్తుంది. బ్లాక్ క్యారెట్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బ్లాక్ క్యారెట్ జలుబు, జ్వరం నుంచి కూడా రక్షిస్తుంది. బ్లాక్ క్యారెట్‌లోని విటమిన్ సీ.. రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది.

ఇది బయటి నుంచి సోకే ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. బ్లాక్ క్యారెట్‌లోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది కళ్లకు మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అద్దాల వాడకం తగ్గే అవకాశం ఉంది. బ్లాక్ క్యారెట్ తినడం అల్జీమర్స్ నుండి రక్షించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యారెట్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు ఆంథోసైనిన్ భాగాలు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

బ్లాక్ క్యారెట్‌కు క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఉంది. ఇందులో ఆంథోసైనిన్ కెమికల్స్ ఉన్నందువల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఉండే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఈ క్యారెట్లు శరీరంలోకి కార్సినోజెనిక్ కణాల ప్రవేశాన్ని నిరోధిస్తాయి. నల్ల క్యారెట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker