Health

బిర్యానీ ఆకుని ఇంట్లో ఇలా చేస్తే ఎన్ని లాభాలున్నాయో తెలుసుకోండి.

తేజపత్ర, తమలపత్ర, బే ఆకు, బిర్యానీ ఆకు.. ఇలా లోకల్‌గా చాలా పేర్లతో పిలుస్తుంటారు. కానీ దీని శాస్త్రీయ నామం లారస్ నోబిలిస్ వివిధ ఆరోగ్య పరిస్థితులకు చికిత్స చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఇది విటమిన్ A,C, ఫోలిక్ యాసిడ్‌తోపాటు వివిధ ఖనిజాల కారణంగా పోషకాల నిధి ఈ ఆకు. మనకు ఆరోగ్యాన్ని అందించే ఓ ఆయుర్వేద మూలిక. మీ సూప్ స్టాక్స్, కూరలు, బియ్యం వంటకాలు మరియు ఇతర రుచికరమైన వాటికి బే ఆకులను జోడించడం వల్ల మీ ఆరోగ్యానికి అద్భుతాలు చేయవచ్చు. అయితే బిర్యానీ ఆకు వంటకి మంచి రుచి ఇవ్వడమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది.

ఇందులో విటమిన్ ఏ, బి 6, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అంతే కాదు జీవక్రియని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్స్, ఎలర్జీ ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. య్ అధ్యయనం ప్రకారం బిర్యానీ ఆకులు స్టెఫిలోకాకస్ ఆరియస్, ఇకోలి పెరుగుదలని నిరోధిస్తాయి. ఇవే కాదు అల్సర్, క్యాన్సర్ కి కారణమయ్యే హెచ్ పైలోరీ బ్యాటిరియాతో పోరాదగలదని సదరు అధ్యయనం వెల్లడించింది. వీటితో పాటు ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలోను సహాయపడుతుంది. అన్నం ఉడికేటప్పుడు కూడా ఈ ఆకులు అందులో వేయొచ్చు.

బిర్యానీ లేదా పలావ్ వండే ముందు తాళింపులో వీటిని వేసుకున్నా దాని రుచి పదార్థానికి చక్కగా పడుతుంది. బిర్యానీ ఆకులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కాపర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక. శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించేందుకు బిర్యానీ ఆకులు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ పేగు కదలికల్ని మెరుగుపరిచి బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అందుకే బిర్యానీ ఆకులతో చేసిన నీటిని లేదా టీని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహులకి ప్రయోజనమే..ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఆర్థరైటిస్, రుమటాయిడ్ వంటి జబ్బుల నుంచి బయట పడొచ్చు. జీర్ణ సమస్యలని తొలగిస్తుంది. ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని నియంత్రిస్తుంది. ఇది మధుమేహులకి మేలు చేస్తుంది. హైపర్ టెన్షన్ నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. బిర్యానీ ఆకులతో తయారు చేసుకున్న టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. చర్మ సంరక్షణకి..మొటిమలు తగ్గించడంతో పాటు చర్మాన్ని తాజగా ఉంచుతుంది. జుట్టు పెరుగుదలకి దోహదపడుతుంది. చుండ్రుని నివారించి పేలు సమస్య పోయేలా చేస్తుంది. విటమిన్ ఏ లోపంతో బాధ పడే వాళ్ళు తరచూ బిర్యానీ ఆకు ఆహారంలో భాగం చేసుకుంటే కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker