News

కుక్కలు మీ బైక్ ను వెంబడిస్తున్నాయా..? వెంటనే మీరు చెయ్యాల్సిన పని ఇదే.

రాత్రిపూట బైక్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు కుక్కలు బైక్‌ను వెంబడించడం మొదులు పెడుతాయి. మీరు ఎప్పుడో ఒకసారి అనుభవించి ఉండాలి. ఇలాంటి ఘటనలు మనలో చాలా మందికి జరిగి ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో బైక్‌ను మరింత వేగంగా నడిపి ప్రమాదాలకు గురైన సంఘటనలు చాలా కనిపిస్తాయి. అయితే ప్రస్తుత రోజుల్లో బైక్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఏ చిన్న పనికి బైక్ పై వెళ్లడం పరిపాటైంది.

అయితే బైక్ పై వెళ్తున్న సమయంలో కుక్కలు వెంటబడిన అనుభవం ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో కలిగే ఉంటుంది. ఆ సమయంలో కుక్కలకు ఎక్కడ దొరికిపోతామో అని మరింత స్పీడ్ తో వెళ్తారు. కానీ అలా చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. కుక్కలు వెంబడించినప్పుడు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. మనం బైక్ పై బయటకు వెళ్ళినప్పుడు అక్కడక్కడా రోడ్లపై కుక్కలు కనిపించడం సాధారణం.

అయితే మనం వాటి పక్కనుంచి వెళ్లే క్రమంలో కొన్ని అలాగే ఉండిపోగా..మరికొన్ని మనల్ని వెంబడిస్తాయి. ఈ క్రమంలో కుక్కలు కరిచిన సందర్భాలు లేకపోలేదు. అయితే కుక్కలు వెంబడిస్తాయని బైక్ స్పీడ్ పెంచితే కింద పడే అవకాశం ఉంది. ఇక రాత్రి వేళల్లో కుక్కల బెడద కాస్త ఎక్కువనే చెప్పుకోవాలి. ఎప్పుడెప్పుడు వస్తామా..వెంబడిద్దామా అని కుక్కలు వెయిట్ చేస్తూ ఉంటాయి. మనం వాటికి చేరువలోకి వచ్చినప్పుడు అవి విపరీతంగా అరుస్తూ వెంబడిస్తాయి.

అవి ఎందుకు అరుస్తున్నాయో మనకు అర్ధం కాదు. అందుకే వీటి నుంచి తప్పించుకోడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మనం రోడ్లపై వెళ్లే క్రమంలో గుంపుగా కుక్కలు కనిపిస్తే వాటి మధ్యలో కాకుండా పక్క నుంచి వెళ్లడం బెటర్. అలాగే మీరు బైక్ పై వెళ్ళేటప్పుడు కుక్కలకు సమీపంగా వున్నప్పుడు ఎంత స్పీడ్ గా వెళ్లినప్పటికీ కూడా వాటి దగ్గర స్లోగా వెళ్లడం మంచిది.

ఇక మీరు బైక్ పై వెళ్ళేటప్పు కుక్కలు అరిచినా లేక వెంబడించిన బైక్ ఆపి ఆ తరువాత స్టార్ట్ చేసి మెల్లగా వెళ్ళండి. ఇక కుక్కలు వెంబడిస్తున్నాయి కదా అని వాటికి దొరక్కుండా ఉండాలని అతివేగంతో వెళ్లడం అసలు మంచిది కాదు. అతివేగంతో కుక్కల నుంచి తప్పించుకున్న కింద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జాగ్రత్తలు పాటించండి..కుక్కల నుండి రక్షణ పొందండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker