ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్. మొదటి సాయం ఎంతో తెలుసా..?
బిగ్ బాస్ ఫైనల్గా ఇన్నాళ్లకు మాట నిలబెట్టుకున్నాడు.తొలి సాయం చేశాడు. షోలో ప్రశాంత్ చెప్పినట్లు పేద రైతులకు సాయం చేస్తానని మాట మాత్రం మరిచిపోయాడా అని సందేహం వచ్చింది.అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ. గజ్వేల్లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఒక రైతు కుటుంబానికి ఏకంగా రూ.లక్ష సాయమందించాడు.
అయితే ఎట్టకేలకు పేద రైతులను ఆదుకునే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. పల్లవి ప్రశాంత్ మొదటి సహాయంగా ఓ కుటుంబానికి రూ. 1 లక్ష ఇచ్చారు. గజ్వేల్ సమీపంలో గల కొలుగూరు అనే గ్రామంలో ఒక పేద రైతు, అతని భార్య మరణించారు. దాంతో వారి పిల్లలు అనాథలు అయ్యారు.
పేరెంట్స్ ని కోల్పోయిన ఆ పిల్లలను కలిసేందుకు పల్లవి ప్రశాంత్, శివాజీ, భోలే షావలి, ఆట సందీప్ ఆ ఊరికి వెళ్లారు. పల్లవి ప్రశాంత్ పిల్లల పేరిట లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అలాగే ఒక ఏడాదికి సరిపడా బియ్యం ఇచ్చాడు. ఆట సందీప్ సైతం తన వంతు సహాయం చేశాడు. రూ. 25 వేలు పిల్లలకు ఇచ్చారు.
దీనికి సంబంధించిన వీడియో పల్లవి ప్రశాంత్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రాణం పోయినా మాట తప్పను. సహాయం చేసిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటానని కామెంట్ చేశాడు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. టాక్స్ కటింగ్స్ పోను రూ. 16 లక్షలు పల్లవి ప్రశాంత్ కి వచ్చినట్లు సమాచారం. ఇవి మొత్తం అతడు పేద రైతులకు పంచాల్సి ఉంది.