బిగ్ బాస్ విజేత అరెస్ట్, పాము విషంతో ఏం చేసాడో తెలుసా..?
‘బిగ్ బాస్ OTT 2’ విజేత యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌ను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఆదివారం అతడిని విచారణకు పిలిచారు. పీపుల్ ఫర్ యానిమల్స్ సభ్యుడు గౌరవ్ గుప్తా నవంబర్ 2, 2023న సెక్టార్-51లో స్టింగ్ నిర్వహించారు. అక్కడికక్కడే ఢిల్లీకి చెందిన నలుగురు స్నేక్‌చామర్స్‌తో పాటు మరొకరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ఎల్విష్ యాదవ్ ఒక ప్రముఖ యూట్యూబర్ అతను బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో పాల్గొని విన్నర్ అయ్యాడు.
ఆ తర్వాత అతని పాపులారిటీ బాగా పెరిగిపోయింది. అతడిని ఇంటర్వ్యూ చేయాలని చూసిన ఓ యూట్యూబర్ పై ఎల్విష్ యాదవ్ దాడి చేసిన విషయం తెలిసిందే. అతని అనుమతి లేకుండా వీడియోలు తీస్తున్నాడు అంటూ ఆగ్రహంతో యూట్యూబర్ పై దాడికి దిగాడు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఎల్విష్ యాదవ్ పై పాము విషయాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి.
గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లో ఎల్విష్ యాదవ్ రేవ్ పార్టీలకు పాము విషయాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్నాడు అంటూ ఆరోపణలు ఉన్నాయి. పాము విషం అక్రమ రావాణా ఆరోపణల నేపథ్యంలోనే పోలీసులు ఎల్విష్ యాదవ్ ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. ఈ ఆరోపణలను ఎల్విష్ యాదవ్ తీవ్రంగా ఖండించాడు. అంతేకాకుండా అతనిపై వచ్చిన ఆరోపణలు రుజువై దోషిగా తేలితే.. బట్టలు విప్పి కెమెరా ముందు డాన్సులు చేస్తానంటూ వ్యాఖ్యానించాడు.
తనపై నమోదైన కేసు అవాస్తవం అంటూ చెప్పకొచ్చాడు. ప్రస్తుతం అతడిని కోర్టుకు తీసుకెళ్తున్న వీడియో వైరల్ గా మారింది. బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Systum ka system hila diya Noida Police me! Chapri #ElvishYadav in Police custody. pic.twitter.com/zCcWeabmij
— Prashant Kumar (@scribe_prashant) March 17, 2024