News

బిగ్ బాస్ షో కి బిగ్ షాక్, సడెన్‌గా ఆపేసిన షో, షాక్ లో బిగ్ బాస్ ఆడియన్స్.

తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు వచ్చినా హిట్ అవుతుంది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఏడో దానిని కూడా మొదలెట్టారు. అయితే, గతంలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల షో రేటింగ్ పడిపోవడంతో ఇప్పుడు ఉల్టా పుల్టా అనే సరికొత్త కాన్సెప్టును తీసుకొస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో కాంట్రవర్సీలు, బిగ్ బాస్ పై కోర్టు కేసులు, హౌస్ లో వల్గారిటీ, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన కంటిస్టెంట్స్ కొందరు ఈ షో అంతా ఫేక్ అని చెబుతూ దుమ్మెత్తిపోసే కామెంట్స్ చేయడం వల్ల బిగ్ బాస్ షోపై జనాల్లో ఆసక్తి సన్నగిల్లుతూ వస్తోంది. ఈ పరిస్థితుల నడుమ అంతా ఉల్టా పల్టా అంటూ బిగ్ బాస్ సీజన్ 7 షురూ చేశారు నాగార్జున.

షో ఆరంభానికి నెల ముందు నుంచే ప్రోమోలు వదులుతూ షోపై ఆసక్తి పెంచే ప్రయత్నాలు చేశారు. అలా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 భారీ రేంజ్ లోనే షురూ అయింది. ఇంతవరకు మీరు చూసిన ఆట వేరు.. ఈ సీజన్ లో మీరు చూడబోయే ఆట వేరు అంటూ వచ్చిన నాగార్జున తొలి రోజే తన మార్క్ చూపించారు. గతంతో పోల్చితే ఈ సారి బిగ్ బాస్ షో మరింత ప్రత్యేకంగా ఉండనుందని చెప్పారు. మొత్తం 14 మంది కంటిస్టెంట్స్ హౌస్ లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్.

టీవీ సీరియల్ (జానకి కలగనలేదు) యాక్ట్రెస్ ప్రియాంక జైన్ తొలి కంటిస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, ఆట సందీప్, షకీలా, శోభా శెట్టి, టేస్టీ తేజ, రితిక రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆట మొదలుపెట్టారు. వాళ్లకు వెరైటీ టాస్కులు ఇస్తూ గేమ్ ఆడిస్తున్నారు బిగ్ బాస్.

ఇంతవరకు బాగానే ఉందిగా.. సడెన్ గా బిగ్ బాస్ 7కి బ్రేకులు పడటం ఏంటి అంటారా? అదేనండీ.. ఈ సారి బిగ్ బాస్ షోని స్టార్ మాలో టెలికాస్ట్ చేయడంతో పాటు హాట్ స్టార్ లో 24/7 ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దాన్ని ఇప్పుడు సవరించారు. ఇప్పటిదాకా హాట్ స్టార్ లో 24 గంటలు ఆందుబాటులో ఉన్న షోను ఆదివారం రాత్రి 10 గంటల 30 నిమిషాల తర్వాత అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.

కాగా.. ఇలా 24/7 ప్రసారం చేస్తున్న కారణంగా రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ వివరాలు ముందే తెలిసిపోతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. బిగ్ బాస్ 7 డిఫరెంట్.. డిఫరెంట్ అన్నారు కానీ ఎప్పటిలాగే పెద్దగా పరిచయంలేని ముఖాలను హౌస్ లోకి తీసుకొచ్చారని జనంలో ఓ టాక్ అయితే నడుస్తోంది. ఎంత వ్యతిరేకత వస్తున్నా బిగ్ బాస్ షో మాత్రం మేజర్ వర్గానికి వినోదం పంచుతుండటం గమనార్హం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker