బిగ్ బాస్ లో దొంగ ఓటింగ్ బాగోతం బయటపెట్టిన శివాజీ, వాళ్ళు అనుకుంటే..?
చంద్రబాబును అరెస్ట్ చేయడం గురించి శివాజీ స్పందిస్తూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు అవతలి వాళ్లను తొక్కాలని ప్రయత్నిస్తారని ఆయన తెలిపారు.ప్రతికారంతో చేసే రాజకీయాలు ఏ పార్టీకి మంచిది కాదని శివాజీ వెల్లడించారు. అయితే గెలుపు ఓటమి అనేది జనాలు నిర్ణయించాలనే నమ్మకాన్ని క్రియేట్ చేసినప్పుడు షో నిర్వాహకుల పై ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది.
జనం మిస్డ్ కాల్స్ ద్వారా ఓట్లు వేస్తున్నప్పుడు .. పది వేల లైన్లు మాత్రమే కాదు .. లక్ష మంది చేస్తున్నప్పుడు కూడా లైన్లు పని చేయాలి. అంతేకాని లైన్స్ ని ఎంగేజ్ లో పెట్టొద్దు .. ఇది జరిగింది. అయినప్పటికీ కూడా బిగ్ బాస్ అనేది గొప్ప షో. ఆ షో ని బ్రతికించడం కోసం నేను నా వంతు కృషి చేస్తాను. నాకు అన్నం పెట్టిన నాగార్జున గారికి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఆ షో బ్రతికిందంటే కేవలం నాగార్జున గారి వల్లే … అది పోకూడదు.
జనానికి అనుమానం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా టీవీ వాళ్ళ పై ఉంది. ఎందుకో తెలియదు .. నన్ను విలన్ ని చేయాలని చూశారు. అతని పేరు చెప్పడం ఇష్టం లేదు .. ఆ కాండిడేట్ ని బాగా లేపే వారు. తప్పు చేయక పోయిన మమ్మల్ని నిందించే వాళ్లు. నాకు అప్పుడే అర్ధమైంది. ఈ విషయాన్ని ప్రశాంత్, యావర్ లకు కూడా చెప్పాను.
ఎండ్ ఏంటి అనేది నాకు తెలిసిపోయింది. నేను బిగ్ బాస్ కి వెళ్ళింది జనం మనసుల్ని గెలుచుకోవడానికి. కప్పు కోసం కాదు. జనం మనసులు గెలుచుకున్నాను. ఒక ఛానల్ అంటే స్ట్రాటజీ ఉంటుంది .. అది మిస్ ఫైర్ అయ్యి నన్ను అలా చూపించి ఉండొచ్చు కానీ .. వాళ్ళని బ్లేమ్ చేయాలని అనుకోవడం లేదు.
ఆడియన్స్ ఓటింగ్ ను ఎప్పటికప్పుడు స్క్రీన్ పై వేయండి. ఎవరికీ ఎన్ని ఓట్లు పడుతున్నాయో తెలిసిపోతుంది. అప్పుడు ఇంకా థ్రిల్ గా ఉంటుంది. బిగ్ బాస్ ఆట అనేది కంటెస్టెంట్స్ మాత్రమే ఆడాలి .. ఇంకెవరు ఆడొద్దు. కంటెస్టెంట్స్ ఆడియన్స్ మధ్య ఆట రంజుగా సాగుతుంది. వాళ్లిద్దరే తేల్చుకుంటారు’ అని అన్నారు.