బిగ్ బాస్ అభయ్ లవ్ స్టోరీ గురించి తెలుసా..? అభయ్ భార్య, పాపని చూసారా..?
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన అభయ్ హీరోగా, డైరెక్టర్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పెళ్లి చూపులు సినిమాలో తన కామెడీ టైమింగ్ కు అందరూ ఫిదా అయ్యారు.ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగానూ, డైరెక్టర్ గానూ మారి అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టాడు. కానీ మూడో వారంలోనే బయటకు వచ్చేశాడు. తను బిగ్ బాస్ లో నిజాయితీగా ఆడాను అని, తనకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు అంటూ తన బిగ్ బాస్ జర్నీ పై ఓ వీడియో షేర్ చేసాడు అభయ్.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. కాగా అభయ్ బయటకు వచ్చాక అతని ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అభయ్ బయటకు వచ్చాక అభయ్ ఫ్యామిలీ, అతని లవ్ స్టోరీ కూడా వైరల్ అవుతుంది. ఓ ఇంటర్వ్యూలో తన భార్యతో కలిసి పాల్గొన్నాడు అభయ్. అభయ్ భార్య పేరు భవాని. అభయ్ కూతురు పేరు అయంతిక. వీరికి 2019లో పెళ్లి జరిగింది. అయితే వీరి లవ్ స్టోరీ ఆసక్తికరంగా ఉంది.
అభయ్ భార్య భవాని వీళ్ళ లవ్ స్టోరీ చెప్తూ.. నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేసేటప్పుడు నాకు సంబంధాలు చూస్తుంటే ఇతని ఫొటోలు వచ్చాయి. జాబ్ చేస్తున్నాడు అని చెప్పారు. కానీ ఎందుకో ఆ ఫొటోలు పక్కన పెట్టి వేరే సంబంధాలు చూసారు మా వాళ్ళు. ఆ తర్వాత మా అన్న ఒకసారి ఈ ఫొటోలు చూసి ఇతను జాబ్ కాదు యాక్టర్ అని చెప్పడంతో మా వాళ్ళు వద్దనుకున్నారు. కానీ ఇది కొంచెం డిఫరెంట్ సంబంధం అనిపించి నేనే అభయ్ కి ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాను. నాకు ఫొటోలు పంపించిన ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత మెసేజ్ చేశాను.
అప్పుడు నా ఫొటోలు ఏం చేసుకున్నారు మీ ఫ్యామిలీ అని తిట్టాడు. అలా తిట్టుకోవడంతో మా పరిచయం మొదలయి మెల్లిగా ఫ్రెండ్స్ అయ్యాము. ఇన్‌స్టాగ్రామ్ లోనే మాట్లాడుకునే వాళ్ళము. అలా ఆ తర్వాత ప్రేమించుకొని ఇంట్లో చెప్తే అతను యాక్టర్ అని వద్దన్నారు. కానీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాము అని తెలిపారు. అలాగే తను బిగ్ బాస్ లో నిజాయితీగా ఆడాను అని, తనకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు అంటూ తన బిగ్ బాస్ జర్నీ పై ఓ వీడియో షేర్ చేసాడు అభయ్.