బిగ్ బాస్ వార్త పై పాయల్ ఏం చెప్పిందో తెలుసా..?

బిగ్ బాస్ వార్త పై పాయల్ ఏం చెప్పిందో తెలుసా..?

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు వారికి పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ ఆమెకు తెలుగులో ఫస్ట్ మూవీ అయినా కూడా మాత్రం బెదురు లేకుండా హీరోతో రొమాంటిక్ సీన్స్లో నటించమంటే జీవించేసింది. ఒక రేంజ్ లో అందాలు ఆరబోసి బోల్డ్ రోల్ లో నటించి మెప్పించింది. అయితే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్‌కు సన్నద్ధమైంది.

మరి కొద్ది రోజులలో మొదలు కానున్న ఈ షోకు సంబంధించి జూమ్ ద్వారా కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం. అయితే ఐదో సీజన్‌ని మరింత స్పెషల్‌గా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌ని షో కోసం ఎంపిక చేసినట్టు కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తుంది.

ఈ విషయం పాయల్ దగ్గరకు కూడా చేరడంతో వెంటనే తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. నేను బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. అది ఫేక్ న్యూస్. ఇలాంటి వార్తలలోకి నన్ను లాగొద్దు అంటూ పాయల్ రాజ్‌పుత్ తన ట్విట్టర్‌లో పేర్కొంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *