ఆ సమస్యలతో భాదపడుతున్న భానుప్రియ, ప్రస్తుతం ఎలా ఉందొ చుడండి.
భానుప్రియ అంటే చాలు.. 80, 90స్ కిడ్స్ కు ఆమె అందమైన ఆమె కళ్లు గుర్తొస్తాయి ..నెమలిలాంటి భాను ప్రియ నాట్యం గుర్తుకు వస్తుంది. కెమెరా ఫ్రేములకు సైతం దొరకని ఆమె వేగం గుర్తొస్తుంది. హీరోయిన్ గా దాదాపు దశాబ్ధానికి పైగా స్టార్ హీరోయిన్ గా తెలుగు తెరను ఒక ఊపు ఊపేసింది భాను ప్రియ. అయితే తెలుగులోనే కాకుండా.. తమిళం, కన్నడ, భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపైన కూడా పలు ధారవాహికలలో కనిపించారు.
గతేడాది వరకు సిల్వర్ స్క్రిన్ పై నటనతో ప్రేక్షకులను అలరించారు భానుప్రియ. అయితే కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కొద్దిరోజులుగా ఆమె లు ఒప్పుకోలేదట. ఇందుకు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అంటూ రూమర్స్ వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన ఆరోగ్యం గురించి వస్తున్న నిజమని అన్నారు. క్లాసికల్ డాన్స్‌తో ఆడియన్స్‌ను అలరించిన ఆమె.. గతంలో ఓ డాన్స్ స్కూల్ పెడదామని అనుకున్నారట.
కానీ ఐదేళ్ల క్రితం ఆమె భర్త ఆదర్శ్ కౌశల్ కన్నుమూడయంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ల నుంచి ఆరోగ్యం బాగుండడం లేదని.. మెమరీ లాస్ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. “ఈ మధ్య కాలంలో నాకు ఒంట్లో బాగోలేద. మెమరీ పవర్ తగ్గిపోయింది. నేర్చుకున్న కొన్ని ఐటమ్స్ మర్చిపోయాను. తర్వాత డాన్స్ మీద ఆసక్తి తగ్గింది.
ఇంట్లో కూడా నేను డాన్స్ ప్రాక్టీస్ చేయట్లేదు ” అన్నారు. గత రెండేళ్లుగా మెమరీ లాస్ సమస్యతో బాధపడుతున్నానని.. ఈ మధ్య ఒక షూటింగ్ సమయంలో డైలాగ్స్ కూడా మర్చిపోయాయని అన్నారు. సిల నేరంగిలిల్ సిల మనిధర్గల్ అనే తమిళ లో యాక్ట్ చేశాను. లొకేషన్‌లోకి వెళ్లి యాక్షన్ అనగానే డైలాగులన్నీ మరిచిపోయాను.
మైండ్ బ్లాంక్ అయిపోయింది. మళ్లీ నేను సర్దుకున్నాక షూట్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఎలాంటి ఒత్తిడికి కానీ, డిప్రెషన్‌కు కానీ లోనుకావడం లేదని స్పష్టం చేసిన భానుప్రియ.. ఆరోగ్యం బాగోకపోవడం వల్లే మరిచిపోతున్నానని అన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నానని అన్నారు.