నూనె తో ఖర్చులేకుండా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచు. ఆరోగ్యానికి కూడా..!
ఆరోగ్యం, అందం, సాంప్రదాయ భారతీయ ఆచారాలలో విస్తృతంగా గంధాన్ని వినియోగిస్తారు. ఈ క్రిమినాశక నూనె తేలికపాటి మట్టి సువాసనను కలిగి ఉంటుంది. ఇది మీ ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడే సెస్క్విటెర్పెనెస్ అని పిలిచే సహజమైన రసాయన సమ్మేళనాలను కలిగి ఉంటుంది.
అయితే గంధం నూనె వలన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. గంధం నూనె ఉపయోగించడం వలన కొన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. బీపీ కంట్రోల్ లో ఉంటుంది.. గంధం నూనెని ఉపయోగించడం వలన బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అలానే దీన్ని ఉపయోగించడం వలన హృదయ సంబంధిత సమస్యల ముప్పు ఉండదు.
జుట్టుకి మంచిదే.. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇంఫ్లమేషన్ గుణాలు ఉంటాయి. జుట్టు కి చక్కగా ఇది పని చేస్తుంది. దంత ఆరోగ్యం బాగుంటుంది.. గంధం నూనె ని ఉపయోగించడం వలన బ్యాక్టీరియా పెరుగుదల ఉండదు. ఇది దంతాలని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది.. గంధం నూనె ని ఉపయోగించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. భావోద్వేగాలు కూడా అదుపులో ఉంటాయి. ఆందోళన, నిరాశ వంటి సమస్యలు ఉండవు. స్కిన్ కి మంచిదే.. గంధం నూనె ఉపయోగించడం వలన చర్మం కూడా బాగుంటుంది. స్కిన్ సమస్యలు వుండవు. చర్మం చాలా అందంగా ఉంటుంది.