కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా.? ఈ ప్రయోజనాలు తెలిస్తే ఆ పని చెయ్యరు.
కరివేపాకు కేవలం వంటకాల రుచి మాత్రమే పెంచుతుంది అనుకుంటే పొరపాటే. రుచితోపాటు.. ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో కాల్షియం, పాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాల లభిస్తాయి. ఇవి కాలేయం.. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు.. బరువు తగ్గించడంలోనూ సహయపడుతుంది. కరివేపాకువల్ల ప్రయోజనాలేంటంటే.. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ యూరిన్, బ్లాడర్ సమస్యలను నివారిస్తుంది. కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి చేర్చి తాగడం వల్ల యూరినరీ సమస్యలు తగ్గుతాయి.
కరివేపాకులో యాంటీహైపర్ గ్లిసమిక్ నేచరల్ కలిగి ఉండటం వల్ల , ప్రధానమైన రక్త నాళాల్లో గ్లోకోజ్ ను కంట్రోల్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరిచి, కొలెస్ట్రాల్ సమస్యను అంతం చేస్తుంది కరివేపాకు వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే చిన్న చిన్న జబ్బులను నివారించడంలో కరివేపాకు సహాయపడుతుంది. గర్భిణీలు మార్నింగ్ సిక్ నెస్, వాంతులు, వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి సంబంధిత రోగాలు దరిచేరవు, కరివేపాకు పేస్టును టీ స్పూన్ చొప్పున మజ్జిగతోగాని నీళ్లతోగాని రెండుపూటలా తీసుకుంటుంటే స్థూలకాయం తగ్గి మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.
కరివేపాకు మెదడుతో సహా నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. చర్మ సంరక్షణ కోసం…కరివేపాకు-వేపాకులు సమానంగా తీసుకుని ముద్దగా నూరి రోజూ రెండుపూటలా టీ స్పూన్ పేస్టుని అరకప్పు మజ్జిగతో కలపి తీసుకుంటే చర్మ సంబంధ సమస్యలు తీరిపోతాయి. కరివేపాకు పేస్ట్ కు కొద్దిగా పసుపు చేర్చి చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్స్ తగ్గుతాయి, ఆరోగ్యకరమైన జుట్టుకి కరివేపాకు మంచి రెమెడీ..
కరివేపాకులోఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆహారంలో రోజూ కరివేపాకుని భాగంగా చేసుకుంటే కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. కరివేపాకుతో పాటు, దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీబయోటిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఇది పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న గ్రాండ్ మదర్స్ చిట్కా.