Health

బెండ‌కాయ‌ను రాత్రంతా నీళ్ల‌లో ఉంచి ఉదయాన్నే తాగితే ఎంత లాభమో..?

బెండకాయల్ని ఎలా తిన్నా… వాటిలో పోషకాలు కొంతవరకూ మనకు అందుతాయి. ఐతే… పూర్తిగా పోషకాలు అందాలంటే… చిన్న చిట్కా మనం పాటించాల్సి ఉంటుంది. చిన్న బెండ‌కాయ‌ల‌ు రెండు లేదా మూడు తీసుకుని, బాగా క‌డిగి, వాటి మొద‌లు, చివ‌రల్ని తీసేయాలి. వాటిని నిలువుగా క‌ట్ చేసుకోవాలి. ఆ ముక్కలను గ్లాస్ నీటిలో వెయ్యాలి. అయితే మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి.

ఇవి మ‌న‌కు ఏ కాలంలో అయినా దొరుకుతాయి. వీటితో చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌లు చేసుకుని తింటుంటారు. కొంద‌రు బెండ‌కాయ వేపుడు చేసుకుంటే.. కొంద‌రు వాటితో పులుసు చేసుకుంటారు. ఇంకా కొంద‌రు ట‌మాటాల‌ను వేసి వండుకుని తింటారు. అయితే బెండ‌కాయ‌ల‌ను ఎలా తిన్నా స‌రే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా బెండ‌కాయ‌ల‌ను కింద తెలిపిన విధంగా తీసుకుంటే.. మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

రెండు బెండ‌కాయ‌ల‌ను తీసుకుని వాటిని బాగా క‌డిగి మొద‌లు, చివ‌ర తీసేయాలి. అనంత‌రం వాటిని నిలువుగా క‌ట్ చేసుకోవాలి. ఆ త‌రువాత ఆ ముక్క‌ల‌ను ఒక గ్లాస్ నీటిలో వేయాలి. అలా ఆ ముక్క‌ల‌ను రాత్రంతా నీటిలోనే ఉంచాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ ముక్క‌ల‌ను తీసేసి ఆ నీటిని తాగాలి. దీంతో కింత తెలిపిన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

పై విధంగా బెండ‌కాయ‌ల‌ను నీటిలో నానబెట్టి ఆ నీటిని నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే జీర్ణాశ‌యం, పేగులు శుభ్రంగా మారుతాయి. గ్యాస్, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌వు. అలాగే ఫైబ‌ర్ పుష్క‌లంగా ల‌భిస్తుంది క‌నుక జీర్ణ స‌మ‌స్య‌లు కూడా ఉండ‌వు. బెండ‌కాయ‌ల‌ను నాన‌బెట్టిన నీటిని తాగ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఇలా చేస్తే వారి షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి. వేడి శ‌రీరం ఉన్న‌వారు ఈ నీటిని తాగితే శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. అలాగే అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. కంటి చూపు స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం ఈ నీటిని తాగితే ఫ‌లితం ఉంటుంది. అలాగే చ‌ర్మం, వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker