స్టార్ హీరోయిన్ తో పెళ్లికి రెడీ అయిన బెల్లంకొండ శ్రీనివాస్. పెళ్లి ఎప్పుడంటే..?
వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శీను అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో. మొదటి సినిమాలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత జతకట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కాగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో వచ్చాయి. అయితే బెల్లంకొండ శ్రీనివాస్..సినిమాల పరంగా సాయి శ్రీనివాస్ కు పెద్దగా హిట్లు పడలేదు. యావరేజ్ సినిమాలతో మాత్రమే సరిపెట్టుకున్నాడు.
మొదటి సినిమాను బడా డైరెక్టర్ వి.వి. వినాయక్ తో చేశాడు. ఆ సినిమా బాగానే ఆడింది. కానీ దాని తర్వాత ఆ రేంజ్ లో హిట్ పడలేదు. ఇక రీసెంట్ గానే ఆయన ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. అదే వి.వి. వినాయక్ దర్శకత్వంలో చేశారు. ట్రైలర్లు, టీజర్లు ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. కానీ సినిమాకు మాత్రం అనుకున్నంత క్రేజ్ రాలేదు. వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
దారుణంగా ఆ సినిమాతో నష్టాలు చూశారు. ప్రస్తుతం మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఆయన పర్సనల్ విషయానికి సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. త్వరలోనే సాయి శ్రీనివాస్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడంట. ఆయన ఓ యంగ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ఆ యంగ్ హీరోయిన్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడట. యంగ్ హీరోయిన్ ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేమిస్తున్నాడట. ఈ విషయం ఇంట్లో తెలిసి వారు కూడా ఓకే అన్నారంట. ఇద్దరివీ పెద్ద కుటుంబాలే కావడంతో పెళ్లికి ఓకే అనేశారంట. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకుని మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.