Health

శివుడికి న‌చ్చిన ఈ పండు తింటే ఎన్ని జ‌బ్బులను దూరం చేస్తుందో తెలుసా..?

బేల్‌లో అనేక విటమిన్లు, ఖనిజాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఫైబర్ పుష్కలంగా ఉంది. ఇంకా నీరు, కొవ్వులు, ప్రోటీన్లు, సుక్రోజ్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు A, B, C, రిబోఫ్లేవిన్ కూడా ఉన్నాయి. బేల్‌లో ఫైబర్ ఎక్కువ. అందువల్ల ఈ పండు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని పోగొడుతుంది. శరీరంలో వేడిని తగ్గించే గుణాలు దీనికి ఉన్నాయి. ఇది పొట్టలో వేడిని తగ్గించి.. చలవ చేస్తుంది. అయితే భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన పండు ఇది.

దీన్ని ఒడియాలో కైతా అని, హిందీలో కోత్బేల్ అని పిలుస్తారు. రుచిలో పుల్లగా ఉంటుంది. భారతీయ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతో కలిపి దీన్ని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందని ఆమె చెప్పారు. ఈ సూపర్ ఫ్రూట్ విరేచనాలు, డయేరియా వంటి జీర్ణ సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. మలబద్ధకం సమస్య నుంచి బయట పడేందుకు ఇదొక గొప్ప ఔషధంగా ప్రసిద్ధి చెందింది.

ఇందులో భేదిమందు గుణాలు ఉన్నాయి. మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలని బయటకి పంపించేస్తుంది. గుండ్రంగా, మెత్తటి గుజ్జు, పీచుని కలిగి ఉంటుంది ఈ పండు. బేల్ పండులో లూపియోల్, యూజినాల్, లిమోనెన్, సిట్రల్, రుటిన్, ఆంథోసైనిన్స్ వంటి ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నందున ఇది కెమోప్రివెంటివ్ ఎఫెక్ట్స్ ను ప్రేరేపించవచ్చని ఆమె చెప్పారు.

ఇది పేగు జీవసంబంధమైన చర్యకు మద్దతు ఇస్తుంది. పేగు వ్యాధి ఐబీఎస్ లక్షణాలని తగ్గిస్తుంది. ఈ వుడ్ యాపిల్ జీర్ణక్రియాలో సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని కలిగి ఉంది. గాయాలు అయిన అవయవాలని నయం చేస్తుంది. ఈ పండులో అధిక ప్రోటీన్ కంటెంట్ కారణంగా గాయాల్ని త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. బలమైన కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది.

ఇందులోని బీటా కెరోటిన్ కాలేయ సమస్యల్ని నయం చేస్తుంది. దీనిలో థయామిన్, రిబోఫ్లేవిన్ ఉన్నాయి. చాకుతో బేల్ పండు తొక్కని తీసేసుకోవాలి. అందులోని గుజ్జును తీసుకుని మసాలా దినుసులు జోడించుకుని తినొచ్చు. ఈ పండు రుచి తీపి, పులుపు కలగలిపి ఉంటుంది. అందువల్ల పండిన పండు గుజ్జును అలాగే లేదా చక్కెరతో కలిపి తింటారు. రసం, జెల్లీ, చట్నీ తయారీకి ఉపయోగించుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker