Health

ఇష్టం ఉన్న లేకున్నా ఆ సమయంలో వీటిని తినాలి. లేకుంటే..?

బీట్ రూట్ రసం చాలా బాగా పని చేస్తుంది. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. అయితే బీట్ రూట్ గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. భూమిలో పండే ఈ బీట్ రూట్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే చాలా మందికి బీట్ రూట్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే బీట్ రూట్ తినడానికి కాస్త తియ్యగా ఉంటుంది.

అలాగే బీట్ రూట్ రంగు కూడా ఎర్రగా ఉండడం వలన చాలా మంది దీనిని తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే బీట్ రూట్ తినడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బీట్ రూట్ ను కూరలాగా అయిన వండుకుని తినవచ్చు లేదంటే జ్యూస్ అయినా చేసుకుని తాగవచ్చు. ఎలా తీసుకున్నాగాని ఆరోగ్యానికి మంచే జరుగుతుంది. బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సి లు ఎదిగే పిల్లలకు ఎంతగానో మంచి చేస్తాయి.పిల్లలు ప్రతి రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఎందుకంటే బీట్‌రూట్ జ్యూస్ వల్ల మెదడుకు సరిపడా రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది.ఫలితంగా పిల్లలలో ఏకాగ్రత పెరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ బీట్ రూట్ అనేది గర్భిణీలకు ఎంతో మంచిది.గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది. తల్లి,బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. బీట్ రూట్ ను క్రమం తప్పకుండా తింటూ ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది.

అలాగే బరువు తగ్గాలని భావించేవారు ప్రతిరోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వలన బరువు సులువుగా తగ్గుతారు. అలాగే బీట్ రూట్ జ్యూస్ తాగితే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.ఇది శరీరంలో అలసట, బలహీనత వంటి సమస్యలను తొలగిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఇందులో ఐరన్ ఉంటుంది. డయాబెటిస్ సమస్యను తగ్గించడానికి కూడా బీట్ రూట్ ను తీసుకోవచ్చు.నిజానికి బీట్‌రూట్‌లో ఉంటే బెటలైన్‌లు అనే సమ్మేళనం వలన బీట్ రూట్ యొక్క రంగు ఎరుపు రంగులో ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker