బీట్‌రూట్ జ్యూస్ ఎక్కువగా తాగితే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు.
కొన్నింటిని పాటిస్తే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్రతి రోజు వివిధ రకాల పండ్లను తీసుకోవడం వల్ల ఎంతో మేలంటున్నారు. ముఖ్యంగా పళ్ల రసాల ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. చాలా మందికి బీట్‌రూట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. దానిని పచ్చిగా తినేందుకు, జ్యూస్ తాగేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అయితే బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది.
ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. ఆక్సలేట్ కాల్షియంతో కలిసి రాళ్లను పెంచుతుంది. అందుకే బీట్ రూట్ జ్యూస్‌కు మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి. ఇక మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారైతే బీట్ రూట్ తినకూడదు. అలెర్జీలు వచ్చే అవకాశం..అలెర్జీల బారిన త్వరగా పడేవారు బీట్‌రూట్ తినకూడదు. వీరి శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. బీట్‌రూట్ అధికంగా తినడం వల్ల కొందరు అనాఫిలాక్సస్ అనే అలెర్జీ స్థితికి కారణం అవుతారు.
దీని ఫలితంగా గొంతు బిగుతుగా మారడం, బ్రాంకోస్పాస్మ్ అనే ఆరోగ్యస్థితి కలగవచ్చు. బీటూరియా..బీట్‌రూట్ లేదా ఎరుపు రంగులో ఉన్న ఆహారాలును అధికంగా తీసుకోవడం వల్ల బీటూరియా వచ్చే అవకాశం ఉంది. అంటే మూత్రం లేదా మలం రంగు మారి ఎరుపురంగులోకి మారుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగకూడదు. ఈ కూరగాయలో నైట్రేట్లు ఉంటాయి. వీటి వల్ల పొత్తికడపులో తిమ్మిరి, నొప్పి వస్తుంది.
గర్భిణులకు.. అధిక నైట్రేట్లు ఉండే బీట్‌రూట్ గర్భిణులు తినడం వల్ల శక్తి లోపించడం, తలనొప్పి, కళ్లు తిరగడం, కళ్లు, నోరు, పెదవులు, చేతులు, కాళ్ల చుట్టూ చర్మం రంగు మారుతుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో లోహ అయాన్‌లు పేరుకుపోతాయి. ఇది దీర్ఘకాలంలో కాలేయాన్ని దెబ్బతీస్తాయి. బీట్‌రూట్ రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. తక్కువ కాల్షియం స్థాయిలు ఉన్న మహిళలు బీట్‌రూట్ జ్యూస్‌ను తీసుకోకూడదు. బీట్ రూట్ కూర కూడా తక్కువగా తినాలి ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు.