బీరకాయలను తేలిగ్గా తీసిపారేయకండి, ఈ ప్రయోజనాలు తెలిస్తే వెంటనే తింటారు.
మార్కెట్లో మనకు రెండు రకాల బీరకాయలు లభిస్తున్నాయి. కొన్నింటి పైభాగం మృదువుగా ఉంటుంది. కొన్నింటి పైభాగం గరుకుగా ఉంటుంది. గరుకుగా ఉన్న పైభాగం కలిగిన బీరకాయలే మనకు ఎక్కువగా లభిస్తుంటాయి. దీంతో ఆ గరుకుదనాన్ని తొలగించి.. బీరకాయను కట్ చేసి కూరగా వండుకుంటుంటారు. కొందరు శనగపప్పు లేదా కోడిగుడ్లతో దీన్ని వండుతారు. అయితే వేసవి కాలంలో అధిక వేడి ఉన్నప్పుడు శరీరం చల్లాగా ఉండటానికి బీరకాయ అనువైన వేసవి కూరగాయగా చెప్పవచ్చు.
అధిక నీటిశాతం, తక్కువ క్యాలరీలు కలిగిన బీరకాయలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం, జింక్, కాపర్ ,సెలీనియం వంటి పోషకాలు ఉన్నాయి. బీరకాయలోని అధిక ఫైబర్ ,నీటి కంటెంట్ మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. బీరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది. శరీరంలో విషపూరిత వ్యర్థాలు, ఆల్కహాల్ అవశేషాలను తొలగించడానికి,కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. కాబట్టి ఇది కాలేయ పనితీరుకు అద్భుతమైనదిగా పరిగణించవచ్చు.
ఎండాకాలంలో అధిక శరీర వేడిని తగ్గించడంలో బీరకాయ బాగా ఉపకరిస్తుంది. బీరకాయ ప్రయోజనాలు.. వాపును తగ్గించడం నుండి బరువు తగ్గించడంలో సహాయం చేయడం వరకు, బీరకాయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ కూరగాయలలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, థయామిన్ మరియు జింక్ వంటి వాటి పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. బీరకాయలో ఐరన్ , మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి.
ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు బీటా-కెరోటిన్‌లో అధికంగా ఉంటుంది కాబట్టి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆల్కహాల్ మత్తు నుండి కాలేయానికి హానికలగకుండా చూస్తుంది. బీరకాయ గుండెకు మంచిది. వివిధ రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడానికి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ సి మరియు ఎముకలకు మంచి మూలం. బీరకాయలో కొన్ని క్రియాశీల పోషకాలు పచ్చిగా తిన్నప్పుడు మాత్రమే సులభంగా లభిస్తాయి.
ఉడికించి తిన్నప్పుడు శరీరంలో బాగా శోషించబడతాయని నిపుణులు చెబుతున్నారు. బీరకాయను సలాడ్లు, కూరలు, ఫ్రైస్, పప్పు వంటి వాటిలో తినవచ్చు. ఈ కూరగాయలలోని అనేక పోషకాలు వంట సమయంలో అంతేఉంటాయి. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లను సంరక్షించడానికి కాబట్టి ఎక్కువ నీరు ఉపయోగించకుండా తక్కువ నీటితో కూరగాయలను ఎక్కువసేపు ఉడికించమని సూచిస్తున్నారు నిపుణులు.