ఈ నల్ల జీలకర్రను ఇలా చేసి వాడితే చాలు, 10 నిముషాల్లో మీ అందం రెట్టింపు అవుతుంది.
నల్ల జీలకర్ర ని తలకు చర్మానికి రాసుకున్నట్లయితే ప్రోటీన్స్ రక్తప్రసరణకు తోడ్పడతాయి. దాంతో జుట్టు బాగా పెరుగుతుంది చర్మానికి కూడా రాసుకోవచ్చు. జుట్టుకి రాసుకున్నట్లయితే చుండ్రు బాధ పోతుంది జుట్టు దృఢంగా ఉంటుంది. అయితే శీతాకాలంలో అనేక చర్మ వ్యాధులు దాడి చేస్తాయి. ముఖ్యంగా చర్మం పొడిబారి, బిగుతుగా మారుతుంది. ఫలితంగా సహజ తేమ పోతుంది.
దానికి తోడు కాలుష్య ప్రభావం కూడా చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. చలికాలంలో కాలుష్యం చర్మానికి అనేక రకాల హాని కలిగిస్తుంది. పైగా ఈ కాలంలో ముఖానికి ప్యాక్‌ని కూడా ఎక్కువ సేపు ఉంచుకోలేరు. అయితే ఈ ప్యాక్ వేసుకుంటే అందంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.
7 నిమిషాల్లో మీ ముఖం మెరిసిపోవడమేకాకుండా చర్మంపై మచ్చలు కూడా తొలగిపోతాయి. నల్ల జీలకర్ర చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నల్ల జీలకర్రలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రెండు చెంచాల నల్ల జీలకర్రలో, రెండు చెంచాల బియ్యం పిండి కలుపుకోవాలి. ఈ ప్యాక్ మొటిమలను నయం చేయడానికి కూడా బాగా పనిచేస్తుంది.
ఈ పొడిలో అర చెంచా గ్లిజరిన్, సరిపడా నీళ్లుపోసి కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని 10 నిమిషాలపాటు మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత అందులో 1 స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె కలుపుకోవాలి. నీళ్లకు బదులు పాలు కూడా వినియోగించవచ్చు. ఈ ప్యాక్ మొటిమల మచ్చలను పోగొట్టడంలో బాగా సహాయపడుతుంది.
ఈ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు ముఖానికి అప్లై చేసుకోవాలి. కనీసం 10 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత తడి గుడ్డతో ముఖాన్ని తుడుచుకోవాలి. ఇది ముఖంపై ఉన్న అన్ని రకాల మచ్చలను తొలగిస్తుంది.