ఈ జ్యూస్ ఒక్కటి తాగితే చాలు, మీ శరీరంలోని చెత్తను బయటకు పంపుతుంది.
బత్తాయిలో పొటాషియం, ఫాస్పరస్, మినరల్స్ వున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బత్తాయి రసాన్ని రోజూ ఒక గ్లాసుడు తీసుకోవచ్చు. బత్తాయి రసాన్ని తీసుకోవడం ద్వారా అలసట మాయమవుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి ఒంట్లో చెత్త వంటివి క్లీన్ చేసుకోవడానికి ఈ జ్యూస్ ని తీసుకోండి.
ఈ జ్యూస్ ని తీసుకోవడం వలన పోషక పదార్థాలు అందడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బత్తాయి రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బత్తాయిలో పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఏ, ఫాస్ఫరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. బత్తాయి రసంతో మనం రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు బత్తాయి రసాన్ని తీసుకోవడం వలన శరీరంలో వ్యర్ధాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరంలో వ్యర్థ పదార్థాలని టాక్సిన్స్ ని బత్తాయి తొలగిస్తుంది.
బత్తాయి లో ఫ్లెవనాయిడ్స్ కూడా ఉన్నాయి జీర్ణ రసాలు పెంచి జీర్ణ క్రియ ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అజీర్తి, పేగు కదలికల్లో సమస్యలు కూడా పోతాయి బత్తాయిని తీసుకోవడం వలన క్యాన్సర్ సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. పేగుల్లో వచ్చే అల్సర్ పూతలని కూడా తగ్గిస్తుంది. రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది.
ఇన్ని లాభాలని బత్తాయి రసం ని తీసుకుని పొందొచ్చు కాబట్టి రెగ్యులర్ గా బత్తాయి జ్యూస్ ని తాగుతూ ఉండండి అప్పుడు ఈ సమస్యలేమీ లేకుండా ఉండొచ్చు. ఈ ఆరోగ్య ప్రయోజనాలు అన్నింటినీ కూడా ఈ జ్యూస్ తో పొందవచ్చు.