ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..?
ఆహారంతో పాటు స్నానం గురించి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. సాధారణంగా ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం చేయాలని చెబుతారు. కుదరకపోతే వంట చేసే ముందు స్నానం చేయాలనే నియమం ఉంది. ఇది సాధారణంగా అందరికీ తెలిసిందే. కానీ స్నానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఈ పంచభూతాలు సహకరించకపోతే మనం ఎంత ప్రయత్నించినా కూడా ఏమీ జరగదు.. వాటి సహకారంతోనే ప్రాథమిక అంశాల నుంచి పరమోన్నత అంశం దాకా మన జీవితం ఒక సంభవంగా మారుతుంది.
మరి ఆ శక్తి వల్లనే మనం మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మన భారతీయ సాంప్రదాయ ప్రకారం గంగాజలాన్ని చాలా పవిత్రమైన జలంగా మనం భావిస్తాం. మరి అలాంటి గంగా నీటిని మనం ఎలా వాడుకోవాలి.. మన భారతదేశం అంతా ప్రవహిస్తున్నటువంటి గంగా నది ఆ తర్వాత ఉపనదులు మనకు నీటిని అందిస్తున్నాయి. మరి ఆ నీటిని మనం ఇంట్లో ఉన్న ప్రతి అవసరానికి ఉపయోగించుకుంటూ ఉంటాం.
అయితే వీటిలో కాలకృత్యుధులకి కూడా ఉపయోగించుకుంటాము. కానీ స్నానం చేసేటప్పుడు మాత్రం నీటిని మనం చాలా జాగ్రత్తగా వాడాలి. అది ఎందుకు అనేది చూసేద్దాం. నీరు భూమి తో సమానం అలాంటి జలాన్ని మనం దిగంబరంగా మన ఒంటిపై పోసుకోవడం అనేది తప్పు. అలాంటి స్నానం ఎప్పుడు చేయిస్తారు అంటే మనిషి గతించిన తరువాత కూతురు, కొడుకు, కోడళ్ళు, అల్లుళ్ళు ఇలా అందరూ అప్పుడు పోస్తారు.
మన నెత్తి మీద నుంచి నీళ్లు పోస్తారు.. అంటే మనిషి తన జీవితాన్ని గతించిన తర్వాత దిగంబర స్నానం అనేది చేయించడం జరుగుతుంది. అలాంటి దిగంబర స్నానాన్ని ప్రతిరోజు చేయడం ఎంత పాపం.. గతించిన తర్వాత చేసేటటువంటి స్నానాలని అర్థం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానాన్ని ఈలా చేయకండి. ఇది మహా పాపం మహా పాపం ఈ వేదాలలో చెప్పబడిన మాట కాబట్టి పరిస్థితుల్లోనూ అలాంటి తప్పు పాపం చేయకండి.
మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో మనం విశ్లేషించుకున్నాం.. వేదాలలో మరొక విధంగా శ్లోకాలు రూపంలో అనేక అనేకమైనటువంటి ఉదాహరణల రూపంలో చెప్పడం జరిగింది. కాబట్టి నీటిని ఎప్పుడూ కూడా పవిత్రంగా భావించాలి. అలాంటి నీటిని మనం ఉపయోగించేటప్పుడు కూడా ప్రతిరోజు ఉదయం వంటగదిలోకి వెళ్లాక చక్కగా మనం మంచి నీళ్లు పట్టుకునేటప్పుడు నీటికి నమస్కరించుకుని చక్కగా బిందెలు కడుక్కుని నీళ్లు పట్టండి.