పల్లవి ప్రశాంత్‌తో బర్రెలక్క పెళ్లి, దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన బర్రెలక్క..!
బిగ్‌బాస్ 7లో ఒక సామాన్యుడు అడుగుపెట్టాడని తెలిసి సపోర్ట్ చేసింది. ఇంకేముంది పలకరిస్తే చాలు తప్పుడు వరుసలు అంటగట్టేసే సమాజం వీరిద్దరికీ ఏదో ఉందని ముడిపెట్టింది. ప్రశాంత్, శిరీష పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట ప్రచారం జరిగింది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి వీరి పెళ్లయిపోయినట్లు మార్ఫింగ్ ఫోటోలు కూడా వదిలారు. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించింది బర్రెలక్క. ఆమె మాట్లాడుతూ..
‘నేను బిగ్‌బాస్ షో అసలు చూడను. అయితే ఏడో సీజన్లో ఒక రైతుబిడ్డ వెళ్లాడని తెలిసి రెండు, మూడు ఎపిసోడ్లు చూశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే హడావుడిలో పడి దాన్ని పక్కనపెట్టేశాను. మళ్లీ గ్రాండ్ ఫినాలే రోజు చూశాను. పల్లవి ప్రశాంత్, ఇటు బర్రెలక్క ఇద్దరూ సోషల్ మీడియాలో భారీ క్రీజ్ ఉన్న వాళ్లే. అయితే.. ఇప్పుడు వీళ్లిద్దరికీ సంబంధించి ఒక కామన్ విషయం వైరల్‌గా మారింది. అదేంటంటే.. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది.
కానీ, దీనిపై ఎలాంటి అధికారక ప్రకటనలేదు. ప్రశాంత్ కానీ, బర్రెలక్క కానీ దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా వాళ్లిద్దరూ ఎప్పుడూ ఒకే వేదికపై కలిసిన దాఖలాలు కూడా లేవు. అయినా కూడా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారనే టాక్ ఎలా వచ్చిందో మాత్రం అర్థం కావడం లేదు. చాల మంది ఈ విషయం నిజం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రైతుబిడ్డ, బర్రెలక్క పెళ్లి చేసుకుంటారనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.