అలెర్ట్, ఈ బ్యాంకు క్రెడిట్ కార్డులు పనిచేయవు. ఎందుకో తెలుసా..?
అప్పుల ఊబి. ఒక్కోసారి ఇందులో చిక్కుకుంటే అప్పులు పెరుగుతూనే ఉంటాయి. వడ్డీ చాలా ఎక్కువ కాబట్టి మీరు దానిని చెల్లిస్తూనే ఉంటారు. క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగిస్తే, దాని ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డు వాడకం వల్ల నష్టాలు ఉన్నప్పటికీ లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి. మీరు కార్డు వాడకంబట్టి ఉంటుంది. సరిగ్గా వాడితే క్రెడిట్ కార్డుతో ఉన్నంత బెనిఫిట్స్ దేనిలో ఉండవు.
అయితే బ్యాంకుల్లో ప్రముఖంగా కొనసాగుతున్న వాటిలో HDFC, AXIS బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకు సెక్టార్ లో ఎస్బీఐ తరువాత హెచ్ డీఎఫ్ సీ కీలకంగా కొనసాగుతుంది. ఈ బ్యాంకులకు కోట్లాది మంది కస్టమర్లు ఉన్నాయి. వీరిలో చాలా మందికి క్రెడిట్ కార్డులు ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీతో పాటు యాక్సిస్ బ్యాంకూ కొన్ని వ్యవహారాల్లో కీలకంగా ఉంటోంది.
ఈ బ్యాంకు కార్డుల ద్వారా నేరుగా షాపింగ్ మాల్స్ లోనే కాకుండా ఆన్ లైన్ లోనూ ట్రాన్జాక్షన్ కు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కార్డుల ద్వారా వివిధ ఆఫర్లు వర్తిస్తాయి. అయితే మే 22న ఉదయం 12.30 గంటల మరుసటి రోజు ఉదయం 2.15 గంటల వరకు హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డులు పనిచేయవు. ఎవరైనా క్రెడిట్ కార్డులతో వ్యవహారాలు జరిపేవారు వాయిదా వేసుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించారు.
ఇక యాక్సిక్ బ్యాంకు క్రెడిట్ కార్డులు ఇదే రోజు ఉదయం 2.15 గంటల నుంచి 3.00 గంటల వరకు పనిచేయవని ఆ బ్యాంకు సిబ్బంది తెలిపారు. అందువల్ల బ్యాంకు ఖాతాదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అయితే ఈ సమయం ఇప్పటికే పూర్తయినా చాలా మంది ఖాతాదారులు ఆ సమయంలో ట్రాన్జాక్షన్లు పెద్దగా లేకపోవడంతో ఇబ్బందులు పడలేదు. సాధారణ సమయంలో అంతరాయం కలిగితే ఇబ్బందులు ఉండేవని కొంత మంది ఖాతాదారులు వాపోయారు.