అమ్మాయిగా మారిన స్టార్ క్రికెటర్ కుమారుడు, సంచలనం రేకెత్తిస్తున్న వీడియో..!
టీమిండియా కు మొన్నటిదాకా బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్ పనిచేశాడు. సంజయ్ కి ప్రస్తుతం 51 సంవత్సరాలు. ఇతడిది మహారాష్ట్ర. 2001 నుంచి 2004 వరకు టీమిండియా కు ఆడాడు. కుడి చేతివాటంతో ఇతడు బ్యాటింగ్ చేయగల నేర్పరి. భారత జట్టు తరుపున ఇప్పటివరకు 12 టెస్టులు ఆడాడు. 15 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. అయితే చిన్ననాటి నుంచి తన తండ్రినే స్పూర్తిగా తీసుకుని పెరిగిన తనకు ఆయనలాగే దేశం తరఫున ఆడాలని ఉందన్నాడు.
అయితే, తాను జెండర్ విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ అవకాశం ఎప్పటికీ దక్కదేమో అన్న ఆందోళన వ్యక్తం చేశాడు. “చిన్నప్పటి నుంచే క్రికెట్ నా జీవితంలో భాగమైంది. పెరుగుతున్న క్రమంలో మా నాన్న దేశానికి ప్రాతినిధ్యం వహించడం, కోచ్‌గా ఉండటం నేను విస్మయంతో చూసేవాణ్ని. ఇప్పుడు నేను కూడా అతని అడుగుజాడల్లో నడవాలని కలలుకంటున్నాను. క్రీడల పట్ల ఆయన చూపిన ఇష్టం, క్రమశిక్షణ, అంకితభావం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.
క్రికెట్ నా ఆశయం మరియు నా భవిష్యత్తు. నేను నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి నా జీవితమంతా వెచ్చిస్తాను. ఏదో ఒక రోజు, అతనిలాగే నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపాడు. “బాధాకరమైన విషయం ఏమిటంటే.. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టి) ద్వారా ట్రాన్స్ ఉమెన్‌గా మారడంతో నా శరీరం బాగా మారిపోయింది. ఒకప్పటి లాగా నా శరీర కండరాలు లేవు. జ్ఞాపకశక్తి , అథ్లెటిక్ సామర్ధ్యాలను కోల్పోతున్నాను.
నేను ఎంతో ప్రేమించి క్రికెట్ నా నుంచి దూరమవుతోంది” అని ఆర్యన్ తన పోస్ట్‌లో రాశాడు. ట్రాన్స్‌జెండర్లకు నో ఎంట్రీ..అయితే, మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనడానికి అనుమతించలేమని నవంబర్ 2023లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పేర్కొంది.
Sanjay Bangar's son undergoes harmone replacement surgery.
— Amit T (@amittalwalkar) November 10, 2024
Aryan becomes Anaya!
Have a look at Ananya's instagram post!#Cricket #CricketTwitter #SanjayBangar pic.twitter.com/esePJjf4Ua