అరటి పండు తొక్కే కదా అని పడేస్తున్నారా..? ఈ విషయాలు తెలిస్తే ఆ పని చెయ్యరు.
అరటి పండులో అనేక పోషకాలు మరియు కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. అరటిపండులో విటమిన్లు B-6, B-12, మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అలాంటి అరటి పండు ని తిని తొక్క పడేస్తూ వుంటాం కదా. అరటి తొక్కలొ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్య పోక తప్పదు. అయితే అరటిపండ్లతో పాటుగా అరటి తొక్కలను కూడా తినేయొచ్చు. ఈ తొక్కలు చర్మ సంరక్షణకే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. అరటితొక్కను వెన్నతో కలిపి తింటే కంటి ఆరోగ్యం బాగుంటుంది. జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది. అరటి తొక్కలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
అరటి తొక్కల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మలబద్దకాన్ని కూడా పోగొడుతుంది. అధిక రక్తపోటు ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అందుకే రక్తపోటును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే అరటి తొక్కలను తింటే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. అరటి తొక్కలో ఫైబర్ కంటెంట్ తో పాటుగా పొటాషియం కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. అరటి పండ్లను తొక్కతో సహా రోజూ తింటే అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. హైబీపీ పేషెంట్లు తొక్కను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తింటే మంచిది. అరటి తొక్కలు ఎముకలను బలంగా చేయడానికి కూడా సహాయపడతాయి.
అరటిపండ్లలో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అందుకే రోజూ ఒక అరటిపండును పిల్లలకు తినిపించాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్లు అరటిపండును తొక్కతో సహా తినడం మంచిది. అరటి తొక్క కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. దీనిలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపర్చడంతో పాటుగా కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.అరటి తొక్క మొటిమలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
ఇందుకోసం అరటితొక్క లోపలి తెల్లని భాగాన్ని ముఖంపై నిమిషం పాటు రుద్దండి. 30 నిమిషాల తర్వాత నీటితో మీ ముఖాన్ని నీట్ గా కడుక్కోండి. తరచుగా ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటుగా చర్మం కాంతివంతంగా మారిపోతుంది. ఇలా కాకుండా ఓట్స్, అరటి తొక్కలతో ప్యాక్ తయారు చేసుకుని కూడా ముఖానికి అప్లై చేయొచ్చు. ఇందుకోసం ఒకటిన్నర కప్పుల ఓట్స్ ని తీసుకోండి. ఒక అరటిపండు తొక్కను పేస్ట్ చేసి దానిలో.. ఓట్స్, చక్కెరను మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి.