Health

జీవితంలో ఒక్కసారైనా అరటి కాండం రసం తాగాలి, ఎందుకో తెలుసా..?

అరటి కాండంలో పీచుపదార్థం వుంటుంది, అందువల్ల దీనిని తీసుకుంటుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు. అరటి కాండంలో విటమిన్ బి6తో పాటు పొటాషియం వుంటాయి. ఇవి హిమోగ్లోబిన్‌ను వృద్ధి చేయడంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తాయి. అరటి కాండం రసం తీసుకుంటే మూత్ర సంబంధిత వ్యాధులు సైతం తగ్గుతాయి. అయితే అరటి పండులోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మనందరికీ అవగాహన ఉండే ఉంటుంది. అయితే అరటిపండు లో ఉన్నన్ని పోషక పదార్థాలు, ఔషధ విలువలు లేత అరటి కాండంలో కూడా ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

సాధారణంగా అరటి పంట చేతికొచ్చిన తర్వాత అరటి కాండం కొట్టి వృధాగా పక్కన పడేస్తుంటారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు చెప్పబోయే అంశాలు పాటించే ముందు తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. అరటి కాడ రసం కొందరిలో తీవ్ర అలర్జీల సమస్యలకు కారణం కావచ్చు. అరటి కాండంలో సమృద్ధిగా పొటాషియం , ఐరన్ , మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, విటమిన్ b6 వంటి సహజ పోషకాలు ఉంటాయని చెబుతున్నారు.

రక్తపోటు సమస్యతో బాధపడేవారు అరటి కాడ రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే పొటాషియం రక్తనాళాలను శుద్ధిచేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు అరటి కాడ రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ b6, ఐరన్ మూలకాలు హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో సహాయపడతాయి.

ఉబకాయం,అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఉన్న వారు అరటి కాడ రసాన్ని సేవిస్తే ఇందులో అత్యధికంగా ఉండే పీచు పదార్థం చెడు కొవ్వుల పరిమాణాన్ని తగ్గించి శరీర బరువు నియంత్రిస్తుంది. జీవశక్తిని పెంచి మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. అరటి కాడ రసంలో ట్యూబర్కొలిస్ బ్యాక్టీరియాను అదుపు చేసే ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధనలు తేలింది.

మూత్ర ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో అరటి కాండం రసం ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే అలాగే ఈ రసాన్ని సేవించిన వారిలో మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతోందట. కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ లోని రాళ్లను అరటి కాండం రసం తగ్గిస్తుందని చెపుతారు. మలబద్ధకం సమస్య వున్నవారు అరటి కాండం కూరను తింటుంటే సమస్య తీరుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker