Health

మీ మీద బల్లి పడిందా..? ఈ విషయాలు మీ కోసమే.

బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు….. కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది.

కొందరు బల్లి మీద పడితే చాలా ఆందోళన చెందుతారు, అయితే శకున శాస్త్రంలో.. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటలను శుభంగా, అశుభంగా పరిగణించబడ్డాయి. మనకు ఏదో చెడు జరగబోతుంది అన్న భావన కలగడం లేదా మన నిజజీవితంలో జరిగే కొన్ని సంఘటలు కూడా మనకు ఎన్నో విషయాల గురించి సంకేతాలను ఇస్తాయి. వీటిలో కొన్ని శుభ సంకేతాలు అయితే.. ఇంకొన్ని అశుభ సంకేతాలు అయి ఉంటాయి. ఇలాంటి సంఘటనల్లో బల్లి అకస్మాత్తుగా పడిపోవడం కూడా ఒకటి. చాలా మందికి బల్లి మీద పడిపోతూ ఉంటుంది.

దీనివల్ల ఏం జరుగుతుందోనని చాలా బయపడిపోతుంటారు. శకున శాస్త్రం ప్రకారం.. అకస్మత్తుగా బల్లి మీద పడటం శుభ సంకేతమే. బల్లి పడటం శుభమా? అశుభమా? బల్లులను చూసి భయపడేవారు చాలా మందే ఉన్నారు. అందులోనూ కొందరిపై అకస్మత్తుగా బల్లి మీద పడుతుంటుంది. ఇంకేముంది ఎక్కడ లేని భయానికి లోనవుతుంటారు. కానీ దీనివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. శకున శాస్త్రం ప్రకారం.. అకస్మత్తుగా బల్లి మీద పడటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది.

ఇలా బల్లి మీద పడటం వల్ల అతను డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అలాగే వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. చేతిపై బల్లి పడితే? బల్లి చేతిమీద పడితే మంచిదా? కాదా? అన్న అనుమానాలు చాలామందికే ఉంటాయి. అయితే బల్లి కుడిచేయిపై పడటం శుభంగా భావిస్తారు. కుడిచేయిపై బల్లిపడితే మీరు డబ్బు సంపాదించబోతున్నాని అర్థం. అయితే శకున శాస్త్రం ప్రకారం.. బల్లి ఎడమ చేతిపై పడటం అశుభంగా పరిగణిస్తారు.

ఎడమ చేతిపై బల్లిపడితే మీరు డబ్బును కోల్పోయే ప్రమాదం ఉందనడానికి సంకేతం కావొచ్చు. బల్లి పాదం మీద పడితే? కళ్లపై కూడా బల్లులు పడుతుంటాయి. దీనివల్ల అసలే జరుగుతుంది అని టెన్షన్ పడిపోతుంటారు. శకున శాస్త్రం ప్రకారం.. మీ కుడికాలుపై బల్లి పడితే ఈ రోజు మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇక మీ ఎడమ కాలుపై బల్లి పడితే అశుభంగా పరిగణిస్తారు. అంటే దీనివల్ల మీ ఇంట్లో గొడవలు, కొట్లాటలు జరిగే అవకాశం ఉందని శకున శాస్త్రంలో పేర్కొనబడింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker