బాల రాముడి ఫొటో నిజమైందేనా..? ప్రధాన పూజారి ఏం చెప్పాడో తెలుసా..?
బాల రాముడి విగ్రహాన్ని పూర్తిగా చూడాలంటే.. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట చేసే వరకూ ఆగాలి. అప్పుడు మాత్రమే చూసేందుకు వీలవుతుంది. ప్రస్తుతానికి విగ్రహాన్ని గర్భ గుడిలోకి తీసుకెళ్లారు. ఆ సందర్భంగా.. మీడియా ప్రతినిధులు ఈ ఫొటోలను తీసుకున్నారు. అయితే ఇటీవల రామ్ లల్లా విగ్రహానికి వస్త్రంతో కప్పి ఉంచిన ఫోటో బయటికి రాగా..
ఆ తర్వాత కేవలం కళ్లకు గంతలు కట్టి ఉన్న విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. చివారాఖరికి బాలరాముడి పూర్తి విగ్రహరూపం కనపించేలా ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ క్రమంలో అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్య క్రమం పూర్తి కాకముందే బాలరాముడి విగ్రహం కళ్లను ఎలా చూపించారని పూజారి సత్యేంద్ర దాస్ ప్రశ్నించారు.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తి అయ్యే వరకు శ్రీరాముడి విగ్రహం కళ్లను బహిర్గతం చేయరాదని ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. ఈ సందర్భంగా కళ్లకు ఉన్న వస్త్రాన్ని తీసి ఉన్న ఫోటోలు నిజమైన రాముడి విగ్రహానికి సంబంధించినవి కావు అని సత్యేంద్ర దాస్ తెలపడంతో సంచలనంగా మారింది.
బాలరాముడి విగ్రహం బహిర్గతం అయిన ఘటనపై విచారణ చేపట్టాలని ఆచార్య సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. మరో వైపు వేద పండితులు ప్రాణ ప్రతిష్ట కంటే ముందే రామ్ లల్లా విగ్రహాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం తప్పని.. పాపం తగులుతుందని హెచ్చరిస్తున్నారు. అతి భక్తితో కొందరు చేసే ఈ చర్యల వల్ల రామ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరి బాలరాముడి విగ్రహం సోషల్ మీడియాలో దర్శనమివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.