Health

టాయిలెట్ సీటు కంటే మీ మొబైల్ పైనే ఎక్కువ బ్యాక్టీరియా. దీనివల్ల ఎలాంటి రోగాలొస్తాయో తెలుసా..?

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వంటి చిట్కాలను పాటిస్తున్నారు. ఈ అలవాట్ల వల్ల హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ నుంచి మనల్ని కాపాడుకోగలుగుతాం. ఎంత పరిశుభ్రంగా ఉన్నప్పటికీ.. ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశం మాత్రం ఉందంటున్నారు నిపుణులు. అయితే టాయిలెట్ సీట్ కంటే మీరు రోజు వాడే ఈ వస్తువులే ఎంతో మురికిగా ఉంటాయి.

శాస్త్రీయ అధ్యయనాలలో కొన్ని రకాల వస్తువులు టాయిలెట్ సీట్ కంటే ఎంత అధికంగా బ్యాక్టీరియా, వైరస్‌ను కలిగి ఉంటాయో చెబుతున్నారు పరిశోధనకర్తలు. ఇవి ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్య పోవడం ఖాయం. తలగడ కవర్..అమెరికాకు చెందిన పరుపుల కంపెనీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఒక వారం పాటు ఉతక్కుండా ఉండే తలగడలో సగటు టాయిలెట్ సీటు మీద ఉన్న బ్యాక్టీరియా కంటే 17వేల రెట్ల బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది.

మొబైల్ ..వివిధ అధ్యయనాల ప్రకారం మీ స్మార్ట్ ఫోన్ పై టాయిలెట్ సీటు కంటే సగటున 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. మీ చేతుల్లో నిరంతరం ఉండే ఈ ఫోను ఎక్కువ సూక్ష్మక్రిములను కలిగి ఉంటుంది. దీన్ని శుభ్రం చేయాలంటే యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్‌తో తుడవడం చాలా ముఖ్యం. లేకుంటే ఫోన్ మీద నుంచి ఉన్న బ్యాక్టీరియా శరీరంలో చేరడం చాలా సులువు.

కీబోర్డు..బ్యాక్టీరియా నిండిన వస్తువు కీబోర్డు. ఒక కీబోర్డ్ పై చదరపు అంగుళానికి 3,000 బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకే దీన్ని కూడా తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. వీటిని యాంటీబ్యాక్టీరియల్ వైప్స్‌తో తుడుస్తూ ఉండాలి. అలాగే వ్యాక్యూమ్ క్లీనర్‌ని ఉపయోగించి లోపల ఉన్న డస్ట్‌ని క్లీన్ చేయాలి. మౌస్..కంప్యూటర్లు వాడే ప్రతి ఒక్కరికి మౌస్ వాడడం అలవాటు. ఈ మౌస్ పై చదరపు అంగుళానికి 1500 బ్యాక్టీరియాలను నివసిస్తున్నట్టు అంచనా.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. మౌస్‌ను కూడా యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ తుడుస్తూ ఉండాలి. రిమోట్ కంట్రోల్..పెద్దలతో పాటు పిల్లలు కూడా రిమోట్ కంట్రోల్‌ను అధికంగా వాడతారు.రిమోట్ కంట్రోల్ పై చదరపు అంగుళానికి 200 బాక్టీరియాలు ఉంటాయి. వీటిని తరచూ తాకడం వల్ల అవి శరీరంలో చేరే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker