Health

బాదం నానబెట్టి తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి.

బాదంపాలతో ప్రొటీన్‌ లభిస్తుంది. అథ్లెట్లు, జిమ్‌కు వెళ్లేవారు ఈ బాదంపాలు తీసుకుంటే వారికి కావలసిన ప్రొటీన్‌ లభిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికీ బాదం ఎంతో ఉపయోగపడుతుంది. మీ రోజువారీ డైట్‌లో బాదంను భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇక అమృతమయమైన విటమిన్‌-ఇ బాదంలో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో కలిసిపోయి, జీవకణాలను నాశనం కాకుండా కాపాడుతుంది. ఎర్రరక్తకణాలను ధృడంగా తయారుచేసి, చెడు కొలెస్టరాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఇక చర్మానికి, వెంట్రుకలకు జరిగే లాభం చెప్పే పనే లేదు. మెరిసిపోయే చర్మం, చిక్కటి, ధృడమైన జుట్టు మీ సొంతం. అలాగే, మతిమరుపు వ్యాధి కూడా దరికి చేరదు. బాదంపప్పు రోజూ తినేవారిలో కాన్సర్‌ వచ్చే ప్రమాదం మామూలు వారికంటే 2-3 రెట్లు తక్కువ. ఇది మధుమేహవ్యాధిగ్రస్తులకు వరం లాంటిది. రక్తంలో షుగర్‌ శాతాన్ని నియంత్రణలో ఉంచుతుంది. బహుశా, బాదంలో ఉండే హెచ్చు మోతాదు మెగ్నీషియం దీనికి కారణమని వైద్య పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టైప్‌-2 మధుమేహబాధితుల్లో మూడోవంతు మెగ్నీనిషియం తక్కువగా ఉన్నవాళ్లే.

బాదంపప్పులో పిండిపదార్థం తక్కువగా, మాంసకృత్తులు, పీచుపదార్థం ఎక్కువగానూ ఉండటం వల్ల, కడుపు నిండుగా అనిపించి, తక్కువ తింటారు. తద్వారా శరీరానికి తక్కువ కెలరీలు లభించి, అనవసర బరువు పెరగకుండా ఉంటారు. ఆయుర్వేదంలో కూడా బాదంపప్పుకు ముఖ్యమైన స్థానం ఉంది. ప్రధానంగా పిత్త, వాత, కఫ దోషాలను సమగ్రంగా అరికడుతుందని ఆయుర్వేద వైద్యుల ఉవాచ. సప్తధాతువులను ఉత్తేజపరచగల తత్వం దీన్లో ఉందని, ముఖ్యంగా శుక్రధాతువు ను ఎంతో ప్రేరేపిస్తుందని ఆయుర్వేదం తెలిపింది, కఫ దోషమున్నవారు మాత్రం బాదంపప్పును మితంగా తినాల్సివుంటుంది. సాధారణంగా బాదం కొంచెం భారమైన గింజ కాబట్టి, దీన్ని అరిగించుకోవాలంటే జఠరాగ్ని బలంగా ఉండాలి.

ఎవరిష్టం వారిది. ఎలా అయినా తినొచ్చు. కానీ, పోషకాహార నిపుణులు, వైద్యులు, ఆయుర్వేదం ప్రకారం…. అయిదారు పప్పులను రాత్రి నానబెట్టి, పొద్దున్నే పరగడుపున మీది పొట్టు తీసి తినడం ఎంతో మంచిది. రుచి కోసమే కాకుండా, ఒక ఆరోగ్యకరమైన సూచన ఇది. చాలా మందికి తెలియని విషయమేమిటంటే, గోధుమరంగులో ఉండే పై పొట్టు లేదా తొక్కలో ‘టానిన్‌’ అనబడే పదార్థముంటుంది. ఇది పోషకాల జీర్ణక్రియను అడ్డుకుంటుంది. నానిన బాదం వల్ల తొక్క సులువుగా వస్తుంది. తద్వారా పోషకాలు తొందరగా విడుదలవుతాయి. సులభంగా జీర్ణమవుతుంది కూడా. నానిన బాదం ‘లైపస్‌’ అనే కిణ్వాన్ని కలిగివుంటుంది. ఇది కొవ్వులను కరిగించడంలో దిట్ట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker