ఈ లక్షణాలు కనిపిస్తే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లే..?
గుండె సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండెపోటు వస్తుందని ఇటీవలే నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇలా గుర్తించాలి.. రక్తం సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయి. అధిక రక్తపోటు తలెత్తుతుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఛాతీ భాగంలో నొప్పిగా ఉంటుంది. కొన్నిసార్లు కాళ్లు, చేతులు, పాదాలపై పసుపు, ఎరుపురంగులో కురుపులు వస్తాయి. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు కనిపిస్తాయి. విపరీతమైన ఆయాసం ఉంటుంది. వికారం కూడా కలుగుతుంది. ఇవీ కారణాలు.. చెడు ఆహారపు అలవాట్లు ఉండటం వల్ల, ఊబకాయం కారణంగా, మద్యం, సిగరెట్ స్మోకింగ్ అలవాటు. వీటిని తినండి..డార్క్ చాక్లెట్స్ మంచివి. అవకాడోలు తింటూ ఉండాలి.
గ్రీన్ టీ, బ్లాక్ టీ తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్‌ను వాడుతుండాలి. తృణధాన్యాలు తినాలి. ఓట్స్, బార్లీ, సోయా బీన్స్ చాలా మంచివి. యాపిల్, నారింజ, నిమ్మ పండ్లు తీసుకోవాలి. బాదం, వెన్న, పసుపు వంటల్లో వాడుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం శ్రేయస్కరం. పసుపు పాలు తాగి అదుపులో ఉంచుకోవచ్చు.
చివరగా..11 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ప్రతి ఐదేండ్లకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. ముఖ్యంగా 45 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల పురుషులు, 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు.. ప్రతి రెండేండ్లకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఎన్నో రోగాలకు ముందుగానే అడ్డుకట్ట వేయవచ్చు.