Health

పాలిచ్చే తల్లులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. లేదంటే..?

తల్లిపాలు ఇచ్చిన ప్రతిసారీ తల్లులకు ఒక్కో అనుభవం ఉంటుంది. చాలా మంది తమ బిడ్డకు తగినంతగా తల్లిపాలు ఇవ్వడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో ఖచ్చితంగా ఊహించలేరు. ఇలా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ, తల్లి పాలివ్వడాన్ని గురించి ప్రాథమిక సమాచారం తెలిస్తే తల్లులు చాలా త్వరగా తమ కార్యకలాపాలను మార్చుకోవచ్చు.

అయితే ఎలా పడితే అలా పసిబిడ్డకు పాలు ఇవ్వడం వల్ల పాపాయికి ఆటంకం కలుగుతుంది. మరి ఒళ్ళో పడుకోబట్టుకొని వంగి ఇవ్వాలా.. పక్కన పడుకోబెట్టుకొని ఇవ్వాలా.. ఇలా బోలెడు సందేహాలతో ఆ తల్లి సతమతమవుతుంటుంది. వాటికి పరిష్కారమే ఇది. పాలిచ్చే భంగిమల్లో పద్ధతులు, క్రెడిల్ భంగిమం.. ఏ వైపు రొమ్ము నుంచి పాలిస్తుంటే ఆ పక్క మోచేతిమీద పాపాయి తలని ఆనించి పట్టుకోవాలి. ఇది సాధారణంగా ఎక్కువమంది పిల్లలకు పాలు పట్టించే విధానం. ఇది మీ ఇద్దరికీ సౌకర్యంగానే ఉంటుంది.

క్రాస్ క్రెడిల్.. సాధారణ ప్రసవమైతే ఒళ్లో పడుకోబెట్టుకొని బిడ్డ తలను లేపి రొమ్ముకి ఆనించి పాలు పట్టాలి. మొదటి ఐదారు నెలల వరకూ ఈ విధానం సౌకర్యంగానే ఉంటుంది. లెయిడ్ బ్యాక్ పొజిషన్.. దీన్నే బయలాజికల్ నర్చరింగ్ విధానం అంటారు. ఈ పద్ధతిలో పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అంతే సౌకర్యంగా ఉంటారు. వెన్నుకి తలగడ ఆధారం చేసుకొని ఏటవాలుగా పడుకొని పాలు పట్టించవచ్చు. ఫుడ్‌బాల్ హోల్డ్.. సిజేరియన్ అయిన తల్లులు ఫుడ్‌బాల్ పొజిషన్ అనుసరించవచ్చు. ఈ భంగిమలో తల్లి దిండుకు ఆనుకొని కూర్చుని బిడ్డ తలను చేత్తో పట్టుకొని పాలు పట్టించవచ్చు. దీనివల్ల బిడ్డ బరువు తల్లి పొట్ట మీద పడకుండా ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker