ఈ అరటిపువ్వుతో వీర్యవృద్ది జరిగి సంతానోత్పత్తి శక్తి పెరుగుతుంది.
అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఇథనాల్ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కారకాలుగా మారే ఫ్రీరాడికల్స్ అనే కాలుష్య పదార్థాలను అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్ సమర్థంగా హరిస్తాయి. వయసుపైబడే ప్రక్రియనూ అరటిపువ్వు మందగింపజేస్తుంది. అలా ఏజింగ్‌ను ఆపుతుంది.
అయితే అరటి పువ్వులలో టానిన్లు, ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. క్యాన్సర్, గుండె సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. అరటిపువ్వు గర్భాశయ సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. గర్భం లోపలి సమస్యలకు ఇది సహజ సిద్ధంగా పనిచేస్తుంది. అరటిపువ్వు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇందులోని మెగ్నీషియం.. డిప్రెషన్‌ను దూరం చేస్తుంది. అరటిపువ్వులో విటమిన్లు ఏ, సీ, ఇ… తోపాటూ ఫైబర్, పొటాషియం వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో ఈ పువ్వు సహాయపడుతుందని రుజువైంది. దీన్ని కాస్త కొబ్బరితో కలిపి తింటే సరిపోతుంది. బాక్టీరియా వృద్ధిని నిరోధించడంలో అరటిపువ్వు సహాయపడుతుంది. మిమ్మల్ని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేస్తుంది.
జ్వరం, జలుబు, విరేచనాల సమస్యకు పరిష్కారం చూపుతుంది. వీర్య కణాల సమస్యతో ఇబ్బందిపడేవారు అరటిపువ్వుని ఆహారంలో భాగంగ చేసుకోవాలి. ఇది తినడం వల్ల వీర్యవృద్ది జరిగి సంతానోత్పత్తి శక్తి పెరుగుతుంది. అరటిపువ్వులో ఉంటే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.ఉడికించిన అరటిపువ్వును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. డయాబెటిక్ పేషెంట్లు ఆందోళన చెందకుండా తినాలి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది.