Health

శరీరంలో ఈ లోపముంటే పిల్లలు పుట్టరా..? అసలు విషయమేంటంటే..?

శరీరంలో అయోడిన్ లోపిస్తే అది జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది. మెదడు ఎదుగుదల తగ్గి బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది. థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా విడుదల కాకపోతే గాయిటర్ అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. థైరాయిడ్ గ్రంథి అనేది హార్మోన్లను సక్రమంగా విడుదల చేయడానికి మన శరీరంలోని స్వల్ప మొత్తంలో అయోడిన్ సేకరిస్తుంది. అయితే ఉప్పును తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు తరచుగా చెప్తుంటారు.

అయినప్పటికీ అయోడిన్ ప్రాముుఖ్యత గురించి మాత్రం ఎక్కువగా చెప్పరు. మీకు తెలుసా..? మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అయోడిన్ చాలా అవసరం. ఇది వివిధ శారీరక విధులను నియంత్రిస్తుంది. అలాగే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అయోడిన్ సాధారణ పునరుత్పత్తి పనితీరుకు అవసరమైనన ఒక ముఖ్యమైన సూక్ష్మపోషకం. ఇది థైరాయిడ్ గ్రంధి పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. అయోడిన్ లోపం వల్ల హైపోథైరాయిడిజం, వంధ్యత్వానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయోడిన్ డెఫిషియెన్సీ డిజార్డర్స్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం నుంచి ఎండెమిక్ క్రెటనిజం వరకు ఎన్నో సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పునరుత్పత్తి వయసులో ఒక సాధారణ వయోజన వ్యక్తికి రోజుకు 150mcg ల అయోడిన్ అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గర్భధారణ సమయంలో, పాలిచ్చే తల్లులకు అయోడిన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే 50 µg/d లేదా ఇంతకంటే తక్కువగా తీసుకుంటే వంధ్యత్వ ప్రమాదం 14 శాతం పెరుగుతుంది.

అయోడిన్ కూడా అండాశయాలు, ఎండోమెట్రియం ద్వారా శోషించుకోబడుతుందని కొత్త పరిశోధలు వెల్లడిస్తున్నాయి. అయోడిన్ తక్కువగా తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా అయోడిన్ ను అండాశయం, ఎండోమెట్రియం ఎక్కువగా తీసుకుంటాయి. అయోడిన్ లోపం వల్ల సంతానోత్పత్తి తగ్గడంతో ముడిపడి ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వంధ్యత్వం సమస్యతో బాధపడేవారు అయోడిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల వారిలో గర్భధారణ రేటు మెరుగుపడిందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

నిపుణుల ప్రకారం.. పురుషుల్లో అయోడిన్ లోపం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. అలాగే తరచుగా గర్భస్రావం అయ్యే ఛాన్స్ లు కూడా ఉన్నాయి. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు అవసరమైన వాటికంటే తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇకపోతే వీరిలో అయోడిన్ స్థాయిలు ఎక్కువైతే.. అంగస్తంభన లోపానికి (70 శాతం) దారితీస్తుంది. అలాగే నాణ్యమైన స్పెర్మ్ రిలీజ్ కాదు. స్పెర్మ్ కౌంట్ కూడా తక్కువగా ఉంటుంది.

థైరాయిడ్ హార్మోన్లు గర్భధారణనకు ముందు అండోత్సర్గము, జీవక్రియ, బరువు నిర్వహణను నియంత్రిస్తాయి. ఇవన్నీ గర్భధారణను పెంచేందుకు సహాయపడతాయి. అయితే థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలతో సంబంధం లేకుండా.. అయోడిన్ పురుషుల స్పెర్మ్ నాణ్యతపై ప్రభావం చూపుతుంది. అందుకే మీరు తినే ఆహారంలో అయోడిన్ పుష్కలంగా ఉండేట్టు చూసుకోండి. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణనకు చాలా అవసరం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker