అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ప్రభాస్, ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
అంగ రంగ వైభంగా బాల రాముడు మందిరంలోని గర్భ గుడిలో గృహ ప్రవేశం చేశాడు. ప్రధాని మోడీ చేతుల మీదుగా బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యకమం జరిగింది. శ్రీ రామ చంద్రుడు ఐదేళ్ళ బాలుడుగా విల్లు, ధనుస్సు చేత బట్టి చిరునవ్వుతో బంగారు నగలతో దర్శనం ఇస్తున్న ముగ్ద మనోహర రూపం చూపరులకు ముద్దుగోలుపుతోంది. అయితే 500ఏళ్లనిరీక్షణ తర్వాత ఆకోదండరాముడ్ని దర్శించుకన్న భక్తలోకం పరవశించిపోయింది.
సుమూహుర్తం ..అభిజిత్ లగ్నంలో 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్లు వరకు..ఈ టైమ్‌లో ఆరుగ్రహాలు అనుకూలం..అన్ని మంచి శకునాలే. సరిగ్గా 84 సెకన్లలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట నిర్వఘ్నంగా..దిగ్విజయంగా పరిపూర్ణమైంది. ఈవేడుకకు యజమాని, కర్తగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైదిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్ ఈ అద్భుత ఘట్టం వీక్షించేందుకు హాజరయ్యారు. చిరంజీవి ఫ్యామితో పాటు మరికొంతమందికి కూడా ఆహ్వానం అందింది. వారిలో ప్రభాస్, ఎన్టీఆర్ కూడా ఉన్నారు. కానీ ప్రభాస్, ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈ ఇద్దరూ తమ షూటింగ్స్ తో బిజీగా ఉండటంతో ప్రాణప్రతిష్ఠకు హాజరుకాలేదని తెలుస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమాషూటింగ్ లో ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు హాజరుకాలేదని తెలుస్తోంది.