ఈ గింజలు తింటే నయంకాని మొండి రోగాలన్నీ తగ్గిపోతాయి.
పరిమాణంలో చాలా చిన్నగా కనిపించే వాటిని ఆవాలతో పోలుస్తూ ఆవగింజంత అంటారు. కానీ వాటి వల్ల కలిగే లాభాలు మాత్రం కొండంత. వేల సంవత్సరాలుగా ఆవాలను వంటల్లో వాడుతున్నారు. ఆవాలు లేని పోపు ఊహించలేము. ఊరగాయలు, పచ్చళ్లు, కొన్ని ప్రత్యేక వంటకాలకు ఆవాలు ప్రత్యేక రుచిని కూడా ఇస్తాయి. అయితే ప్రతి వంటింట్లో కనిపించే ఆవాలు అనేక ఔషధ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఆవాలలో అద్భుత శక్తి ఉంది. 100 గ్రాముల ఆవపిండిలో దాదాపు 508 కేలరీలు ఉంటాయి. ఇందులో వేగంగా పెరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ఆవాలకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే శక్తి మాత్రమే కాకుండా శరీర బరువును తగ్గించే శక్తి కూడా ఉంది. చూడడానికి పరిమాణంలో చిన్నగా ఉన్న వీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడన్ని. శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. ఆవాలలో ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్ , ప్రోటీన్లు, ఐరన్, జింక్, మాంగనీస్, కాల్షియం, మెగ్నీషియం, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఆవాలలో పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతాయి.
అయితే జీర్ణశక్తి, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. ఒక టీ స్పూన్ ఆవాల పొడిని తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే పేగుల్లో పెరిగిపోయిన మలం తేలికపడి మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి ఆవాల పొడి చక్కగా పనిచేస్తుంది. ఆవాల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే, వయసుతో సంబంధం లేకుండా వచ్చే కీళ్లనొప్పులు కూడా ఆవాలతో దూరమవుతాయి. ఆవాల ముద్దలో కర్పూరము కలిపి ఆ మిశ్రమాన్ని కీళ్ళ నొప్పులకు రాస్తే..ఉపశమనం కలుగుతుంది. జ్వరం ఉన్నప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో చిటికెడు ఆవాల పొడి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిలో తేనె వేసుకుని తాగితే జ్వరం తగ్గుతుంది.
ఆవాల పొడితో జుట్టును శుభ్రపరుచుకుంటే జుట్టు సౌందర్యం మెరుగుపడుతుంది. జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి. ఆవాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి చక్కగా సహాయపడతాయి. కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి చల్లారిన తర్వాత వడగట్టి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. పులిపిర్లను తగ్గించడానికి ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆవాలను నూరి ఆ మిశ్రమాన్ని పులిపిర్లు ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే పులిపిర్లు ఎండిపోయి రాలిపోతాయి.
ఆవపిండిలో శరీరానికి అవసరమైన నూనె ఉంటుంది. దీనితో పాటు, ముఖ్యమైన ఆమ్లాలు సినిగ్రిన్, మైరోసిన్, ఎరుసిక్, ఐకోసెనోయిక్, ఒలిక్ మరియు పాల్మిటిక్ ఆమ్లాలు ఉన్నాయి. ఆవపిండిలోని ఎంజైమ్ కార్యకలాపాలు నాడీ వ్యవస్థ పనితీరు, పెరుగుదల మార్పుపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇందులో ఫోలేట్స్, నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్, పిరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఆవాలలో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, ఐరన్ కణాల పెరుగుదలకు దోహదపడుతుంది. దగ్గును నియంత్రిస్తుంది. జీర్ణ రుగ్మతలను సరిచేస్తుంది. మైగ్రేన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎక్కిళ్లను నియంత్రిస్తుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది.