అవకాయ పచ్చడి చేసిన చిరు భార్య, పాసన వీడియో తీయడం ఎంత బాగుందో..!
‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ సురేఖ, ఉపాసన అత్తకోడలు కలిసి ఆన్లైన్ బిజినెస్ వ్యాపారాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. సాంప్రదాయ రుచులలో భాగంగా ఇంట్లోనే చేసుకునే వంటకంలా వారి ప్రొడక్ట్స్ ఉండబోతున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగానే వారు చెప్పినట్లుగా చేసే పనిలో పడ్డారు అత్తకోడలు. ఇకపోతే ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే.. కేవలం చెప్పడమే కాదు.. నోరూరించే ఆవకాయ పచ్చడి కూడా తన చేతులతో రెడీ చేస్తోంది మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ.
అయితే మెగాస్టార్, మెగా పవర్ స్టార్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. మరి ఇంట్లో ఉండే చిరంజీవి తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, కోడలు ఉపాసన ఏం చేస్తుంటారు అని అంతా అనుకోవచ్చు. అయితే వాళ్లు ఈ మధ్యనే ఓ బిజినెస్ స్టార్ట్ చేశారు. చిరు సతీమణి సురేఖ బర్త్ డే రోజున ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ ఉపాసన ఆన్‌లైన్ బిజినెస్ ప్రారంభించారు. సంప్రదాయ రుచులతో ఇంట్లో చేసుకునే వంటకంలా తమ ప్రొడక్ట్స్ ఉండనున్నట్లు తెలిపారు.
అయితే ఇప్పుడు వారు అదే పనిమీద ఉన్నారు. అయితే ఇక్కడ విశేషమేంటంటే.. నోరూరించే ఆవకాయ పచ్చడిని చిరు భార్య సురేఖ తన చేతులతో ప్రిపేర్ చేయడం. అవునండీ మీరు విన్నది నిజమే.. సురేఖ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. అందులో అంజనాదేవి, సురేఖను చూడవచ్చు.
సురేఖ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు.. అక్కడే అంజనాదేవి కూర్చుని చూస్తుంది. వీటంతటిని ఉపాసన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముందుగా అంజనాదేవి దగ్గరకు వెళ్లి నాయనమ్మ మీరు ఎందుకు ఇంత సీరియస్‌గా ఉన్నారు అని అంటుంది. దానికి ఆమె పనిలేక ఇక్కడ కూర్చున్న అంటుంది. ఆ తర్వాత సురేఖ దగ్గరకు వెళ్లి అత్తమ్మ క్యా హోరా అత్తమ్మ అంటుంది.
ఆ తర్వాత వెల్కమ్ టు అత్తమాస్ కిచెన్ అంటూ ఆ వీడియో చివర్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధిన వీడియో చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మెగా ఫ్యామిలీ ఎంత చూడ ముచ్చటగా ఉందో అని కామెంట్లు పెడుతున్నారు.
#Upasanakonidela cute Telugu 😅with her Ammama & Athamma
— Filmy Bowl (@FilmyBowl) April 20, 2024
Surekha gaaru making Avakay pachadi for #Athamma'sKitchen pic.twitter.com/Y41sEz3dUa