Health

అటుకులను ఇలా పాలలో వేసి తింటే చాలు. ముందుగా ఏం చెయ్యాలంటే..?

వరి ధాన్యం నుంచి అటుకుల‌తో మన భార‌తీయులు ఎన్నో ర‌కాల వంట‌లు చేస్తారు.ముఖ్యంగా అటుకుల పులిహోర‌, అటుకుల ఉప్మా, అటుకుల పొంగ‌లి, అటుకుల క‌ట్ లైట్, అటుకుల పాయ‌సం, అటుకుల దోసె, మసాలా అటుకులు ఇలా అనేక ర‌కాల రెసిపీలు త‌యారు చేస్తారు. అయితే పోహా అనేది తేలికైన, ఆరోగ్యకరమైన అల్పాహారం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారతీయులు అందరూ ఈ అల్పాహారాన్ని ఇష్టపడతారు.

దీనిని విధ రూపాలలో చేసుకొని తింటారు. అల్పాహారంలో ఎప్పుడూ తినే లెమన్, టొమటో ఫ్లేవర్లకు భిన్నంగా తీపితో ట్విస్ట్ ఇచ్చి మధురమైన మిల్క్ పోహా చేసుకోవచ్చు. ఈ స్వీట్ మిల్క్ పోహా రెసిపీ కూడా మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది, పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. చక్కెర లేదా బెల్లం పాకంతో తయారు చేసుకోగలిగే ఈ అల్పాహారానికి ఎక్కువ శ్రమ కూడా అవసరం, ఇది మధ్యాహ్నం వరకు మీ కడుపుని నిండుగా ఉంచుతుంది.

దీనిని సాయంత్రం వేళ, ఉపవాసం సమయాల్లోనూ ఆస్వాదించవచ్చు. Sweet Milk Poha Recipe కోసం కావలసినవి. 1/2 కప్పు బ్రౌన్ రైస్ అటుకులు. 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి. 3 టేబుల్ స్పూన్లు బెల్లం సిరప్. 1/2 కప్పు పాలు. 2 అరటిపండ్లు. స్వీట్ మిల్క్ పోహా రెసిపీ- తయారీ విధానం..ముందుగా అటుకులను చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. నీటిని పూర్తిగా వడకట్టి, మెత్తబడేవరకు పక్కన పెట్టుకోండి.

ఆ తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో తరిగిన అరటిపండు, బెల్లం పాకంతో పాటు కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు, ఈ అరటి మిశ్రమాన్ని, మెత్తటి అటుకుల గిన్నెలోకి బదిలీ చేసి బాగా కలపండి. ఈ గిన్నెలో పాలు వేడి చేసి అటుకుల మిశ్రమంలో పోసి, బాగా కలిపేయండి. అంతే స్వీట్ మిల్క్ పోహా రెడీ, వేడివేడిగా ఆస్వాదించండి, చల్లగా అయినా రుచిగానే ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker