ATM కి వెళ్తున్నారా..? RBI కొత్త రూల్స్ తో..?

ATM కి వెళ్తున్నారా..? RBI కొత్త రూల్స్ తో..?

ప్రస్తుతం కస్టమర్లకు సొంత బ్యాంకు ఏటీఎంలల్లో మొత్తం 5 ట్రాన్సాక్షన్స్ ఉచితం. మెట్రోల్లో అయితే ఇతర బ్యాంకు ఏటీఎంలల్లో మూడు ట్రాన్సాక్షన్స్ ఉచితం. నాన్ మెట్రోల్లో ఐదు లావాదేవీలు ఉచితం. ఇందులో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అయితే 2022 జనవరి 1 నుంచి నెలవారీ ఉచిత లావాదేవీలు ముగిశాక చేసే ప్రతి లావాదేవీపై ఖాతాదారులు రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి లావాదేవీలపై ప్రస్తుతం వినియోగదారుల నుంచి బ్యాంకులు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నాయి.

ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు-నిర్వహణకు వ్యయాలు పెరగడం, ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెరగడం, సాధారణ ఖర్చులకు గాను వినియోగదారు ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. సొంత బ్యాంక్‌ ఏటీఎంల నుంచి వినియోగదారులు ప్రతి నెలా 5 ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు కలిపి) నిర్వహించుకోవడం కొనసాగనుంది. మెట్రో కేంద్రాల్లో ఇతర బ్యాంకు ఏటీఎంలలో 3 ఉచిత లావాదేవీలు, మిగతా ప్రాంతాల్లో 5 లావాదేవీలను అనుమతిస్తారు.

businessman inserts a credit card into the ATM to withdraw money and holding a phone

ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీపై రూ.5 నుంచి రూ.6కు ఛార్జీ పెంచుకునేందుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. ఏటీఎం లావాదేవీలపై ప్రస్తుత ఛార్జీలు 2014 ఆగస్టు నుంచి, ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీలు 2012 ఆగస్టు నుంచి అమలవుతున్నాయి. దేశంలో గత మార్చి 31కు చూస్తే బ్యాంకు కార్యాలయాల ప్రాంగణాల పరిధిలో 1,15,605 ఏటీఎంలు, ఇతర ప్రాంతాల్లో 97,970 ఏటీఎం కేంద్రాలున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 90 కోట్ల డెబిట్‌ కార్డులు వాడుకలో ఉన్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *