Health

ఆస్తమా ఉన్న వారు దీపావళి రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

ద‌గ్గు,ఛాతి బిగిసిపోవ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది మ‌రియు నిద్ర‌లో గుర‌క‌పెట్ట‌డం వంటివి ఈ వ్యాధి యొక్క ల‌క్ష‌ణాలు. సాధార‌ణంగా కుటుంబ‌లో ఎవ‌రికైనా నాస‌ల్ లేదా స్కిన్ అలెర్జీలు ఉన్న ఈ వ్యాధి సోకే అవ‌కాశం ఉంది. అయితే దీపాల పండుగ అంటే భారతదేశంలో ఘనంగా జరుపుకునే వేడుక. పిల్లలు, పెద్దలు ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూస్తారు. ఆ రోజున బాణాసంచా పేలుళ్లతో ఆకాశం మిరుమిట్లు గొలుపుతుంది. అయితే ఉబ్బసం రోగులకు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి మాత్రం దీపావళి అంటే భయానకమైన రోజునే చెప్పుకోవాలి.

శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి దీపావళి రోజున ఎన్నో ఇబ్బందులు వస్తాయి. బాణాసంచా కాల్చడం వల్ల వచ్చే పొగ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఊపిరి ఆడనివ్వదు. శబ్ద కాలుష్యం కూడా ఇబ్బంది పెడుతుంది. అసలే శీతాకాలం వల్ల ఇబ్బంది పడే ఆస్తమా రోగులు ఈ దీపావళి బాణాసంచా పొగతో మరింతగా ఇబ్బంది పడతారు. దీపావళి ముగిశాక కూడా రెండు, మూడు రోజులు పాటు గాలిలో ఆ బాణాసంచా నుంచి విడుదలైన రసాయనాల ప్రభావం ఉంటుంది. అందుకే ఆస్తమా వ్యాధి ఉన్నవారు దీపావళి పండుగకు ముందుగానే సిద్ధం అవ్వాలి. ఆరోజు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

శ్వాసకోశ వ్యాధులు ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..ఉబ్బసం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక శ్వాస కోశ పరిస్థితి. ఈ వ్యక్తులకు ముక్కు నుండి గాలి.. ఊపిరితిత్తులు చేరే మార్గం చాలా సున్నితంగా ఉంటుంది. కాలుష్య కారకాల వల్ల ఆ వాయు మార్గాలు ఇన్‌ఫ్లమేషన్‌కు గురై సంకోచించి ఇరుకుగా అవుతాయి. దీనివల్ల వారికి ఊపిరి ఆడనట్టు అవుతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు దీపావళి సమయంలో బాణ సంచాను కాల్చడం మానుకోవాలి. అలాగే మరికొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. బాణాసంచా కాల్చేందుకు ఎక్కువ మంది గుమిగూడిన ప్రదేశాలకు ఆస్తమా రోగులు వెళ్లకూడదు. విశాలమైన రోడ్లలోనే ప్రయాణించాలి. గాలి కాలుష్యం అధికంగా ఉందనిపిస్తే ఇంట్లోంచి బయటికి రాకపోవడమే మంచిది.

దీపావళి రోజున వీలైనంతవరకు ఇంట్లోనే మీకు ఇష్టమైన వారితో గడపండి. వాయు కాలుష్యానికి దూరంగా ఉండండి. కిటికీలు తలుపులు అన్నీ మూసే ఉంచుకోండి. లేకుంటే బాణాసంచాలోని రసాయన మిశ్రమాలు మీ ఇంట్లోని గాలిలో కూడా కలిసే అవకాశం ఉంది. పండుగ రోజు ఎన్95 వంటి మాస్కులను ధరించండి. అవి సూక్ష్మ కణాలు కూడా ముక్కును చేరకుండా అడ్డుకుంటాయి. కాలుష్య కారకాలను ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్ చేయని గాలిని పీల్చుకుంటే మీకు ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. మాస్క్ కాస్త తడిగా మారిందని అనిపిస్తే వెంటనే మార్చేయండి. దీపావళి రోజున బయట తిరగడం పూర్తిగా మానేయండి.

ఆ రోజున గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. బయట చేసుకోవాల్సిన పనులను ఉదయం 10 లోపే పూర్తి చేసుకుని ఇంటికే పరిమితం అవ్వండి. మరుసటి రోజు కూడా బయటికి వెళ్లే పనులను పెట్టుకోకండి. దీపావళి రోజు ఇంట్లో పూజలు, పునస్కారాల పేరుతో ధూపాలు వేయడం, అగరబత్తులు వెలిగించడం చేస్తూ ఉంటారు. ఇవి కూడా ఆస్తమా రోగులకు చాలా ప్రమాదకరమైనది. వాటికి కూడా దూరంగా ఉంటే మంచిది. మీరు ఉన్న ప్రదేశంలో ఖచ్చితంగా ఎయిర్ ప్యూరిఫైయర్‌ని పక్కనే పెట్టుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker