Health

అరెంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా..?పెళ్ళికి ముందే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.

పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. అరెంజ్డ్ మ్యారేజ్ లో లైఫ్ పార్టనర్ ను ఎంచుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది మీ లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రేమ పెళ్లిలో అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు బాగా తెలుసుకుంటారు.

అలాగే ఒకరి గురించి ఒకరికి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అలా అని అరెంజ్డ్ మ్యారేజ్ చెడ్డదని కాదు. ప్రేమ పెళ్లి అయినా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. అబ్బాయి లేదా అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అయితే అరెంజ్డ్ మ్యారేజ్ లో అమ్మాయి, అబ్బాయి కంటే పెద్దల భాగస్వామ్యమే ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా మన ఇండియాలో అమ్మాయి లేదా అబ్బాయిల కుటుంబం ఎలాంటిదని ముందుగా ఆరా తీస్తారు. ఆ తర్వాతే అమ్మాయి లేదా అబ్బాయి గురించి అడుగుతారు. మీ ప్రాధాన్యతలను విస్మరించడం.. అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా.. జీవిత భాగస్వామి ఇలా ఉండాలి? అలా ఉండాలని ఎన్నో కలలు కంటుంటారు.

అయితే పెద్దల కోసం ఈ కలలను వదిలేస్తుంటారు. అంటే వీరి కోరికలను అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ మీరు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మీ కోరికలు, లక్ష్యాల గురించి మీ ఫ్యామిలీకి ముందుగానే చెప్పండి. దీంతో వారు మీకు నచ్చేవిధంగా ఉండే భాగస్వామిని చూస్తారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు..పెద్దల బలవంతం వల్లో.. మరే ఇతర కారణాల వల్లో చాలా మంది తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటుంటారు.కానీ ఈ తొందర పాటు పెళ్లి తర్వాత ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఎవరి ఒత్తిడివల్లే మీరు వెంటనే మీ నిర్ణయం చెప్పకుండా.. ఒకరినొకరు మాట్లాడుకుని, తెలుసుకుని ఓకే చెప్పండి.

అంతేకానీ ఏదీ తెలుసుకోకుండా పెళ్లికి ఓకే చెప్తే మాత్రం చిక్కుల్లో పడతారు. మాట్లాడుకోకపోవడం..అరెంజ్డ్ మ్యారేజ్ లో పెద్దలదే అంతా ఉంటుంది. అంటే పెళ్లి చేసుకునే అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది పెద్దలు పెళ్లికి ముందు అబ్బాయిని, అమ్మాయిని ఒకరితో ఒకరు మాట్లాడుకోనివ్వరు. లేదా చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. కానీ దీనివల్ల అమ్మాయి లేదా అబ్బాయి ఒకరికొకరు పూర్తిగా తెలుసుకోలేరు. దీనివల్లే అరెంజ్డ్ మ్యారేజ్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎలాంటి సంబంధమైనా సరే బలంగా ఉండటానికి ఒకరికొకరు మాట్లాడుకోవడం చాలా చాలా ముఖ్యం. నిర్ణయం మీరే తీసుకోండి..అరెంజ్డ్ మ్యారేజ్ లో పెద్దల మాటకు విలువ ఎక్కువ. అయితే ఇలాంటి పెళ్లిల్లో.. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ‘నాకిష్టమే లేకున్నది మీ మాటతోనే చేసుకున్నా’ అని పెద్దలను నిందిస్తూ ఉంటారు. మీకు కూడా ఇలా కాకూడదంటే.. మీ నిర్ణయమేంటో అప్పుడే చెప్పేయండి. పెళ్లి తర్వాత బాధపడినా పెద్దగా లాభం ఉండదు. అందుకే ఆచీతూచీ నిర్ణయాలు తీసుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker