సెల్యూట్, తాను చదివిన స్కూల్ బాగుకోసం భారీ విరాళం ఇచ్చిన స్టార్ కమెడియన్.
అప్పుకుట్టి తాను చదివిన స్కూల్ కు ఏకంగా 11 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు.తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా నాథన్ కినరు అప్పుకుట్టి స్వస్థలం. అయితే ప్రముఖ తమిళ కమెడియన్ అప్పుకుట్టి గొప్ప మనసు చాటుకున్నాడు. తాను చదివిన పాఠశాలకు ఏకంగా రూ.11 లక్షలు విరాళం ఇచ్చి అక్కడి విద్యార్థుల కళ్లల్లో వెలుగులు నింపాడు. వివరాల్లోకి వెళితే.. అప్పుకుట్టి స్వస్థలం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నాథన్ కినరు. ఆ ప్రాంతంలోని ముత్తారమ్మన్ ఆలయంలో జరుగుతున్న సంబరాలకు అప్పుకుట్టి హాజరయ్యాడు.
ఇదే వేడుకల సందర్భంగా నాథన్ కినేరులోని తాను చదువుకున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కూడా వెళ్లాడు. అక్కడి గ్రామ ప్రజల కోరిక మేరకు రూ. 11 లక్షల ఖర్చుతో కంప్యూటర్లు,టేబుల్స్, టీవీ, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, తదితర విద్యా సామాగ్రిని కొని పాఠశాలకు అందజేశాడు. ‘నేను ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి, రెండు తరగతులు చదివాను. అయితే ఇక్కడ కనీస వసతులు లేవని నా దృష్టికి వచ్చింది.
ఈ కారణంగానే పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగానే ఉందని తెలిసింది. గ్రామ ప్రజలు, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పాఠశాలకు అవసరమైన సామగ్రి అందించాను’ అని అప్పుకుట్టి చెప్పుకొచ్చాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుకుట్టి కోరాడు. అప్పుడే సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు.
మనం ఊరి బయట ఉన్నా, ఏడాదికి కొన్ని రోజులు ఊరిలోనే నివాసం ఉండాలని, సొంతూరికి మన వంతు సాయం చేయలని అప్పుకుట్టి తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులో అప్పుకుట్టికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అజిత్, శింబు సినిమాల్లో ఎక్కువగా కమెడియన్ గా కనిపించే ఆయన గతంలో హీరోగానూ నటించారు. అళ్ గర్ సామియిన్ కుదిరై అనే సినిమాలో తన అభినయానికి గానూ ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ కూడా అందుకున్నాడు.
ராஜூ சந்ரா இயக்கியுள்ள "பிறந்தநாள் வாழ்த்துகள்" படத்தின் First Look Poster-ரை வெளியிட்ட அண்ணன் மக்கள் செல்வன் விஜய் சேதுபதி@actor_appukutty @VijaySethuOffl @kumaran_VSP @MakkalSelvanFC pic.twitter.com/XrvGnuxIKh
— VIJAYSETHUPATHI IT WING CUDDALORE OFFICIAL (@VJS_CUDDALORE) May 7, 2024