యాపిల్ తిన్న తర్వాత ఈ పనులు పొరపాటున కూడా చేయొద్దు.
యాపిల్స్‌లో అనేక విటమిన్లు ,మినరల్స్ ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా విటమిన్ సి, B6 ,విటమిన్లతో పాటు, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్ ,అనేక పోషకాలు కనిపిస్తాయి. అయితే యాపిల్ పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే.. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పనిలేదని చాలామంది చెప్తుంటారు..
అయితే యాపిల్ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్య పాలవుతారని చెబుతున్నారు. యాపిల్ పండులో పొటాషియం, మాంగనీస్, భాస్వరం, ముఖ్యంగా విటమిన్ సి, బి6 అధికంగా ఉంటాయి.. డయాబెటిస్ ఉన్నవారు యాపిల్ పండు ను రెగ్యులర్గా తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే యాపిల్ ఇది తిన్న వెంటనే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుంది.
మాంసాహారం లో భాగమైన “చాపలు” తిన్న వెంటనే పాలు లేదా పెరుగు తీసుకోకూడదని పెద్దలు చెబుతూనే ఉంటారు. అలాగే ఆపిల్ పండు తిన్న తర్వాత కనీసం రెండు గంటల వరకు అయినా పెరుగుని కలిపి తినకూడదట. దీనికి కారణం ఏమిటంటే యాపిల్, పెరుగు ఉండు కూడా శరీరాన్ని చల్లబరిచే ఆహార పదార్థాలు.. కాబట్టి శరీరం వెంటనే చల్లబడుతుంది.. అందువల్ల శరీరంలో కఫ ఏర్పడే ప్రమాదం ఉంది.
అలాగే తిన్న వెంటనే నిమ్మకాయ లేదా ఊరగాయ వంటి ఏవైనా పుల్లటి ఆహార పదార్థములు తీసుకోవడం వలన కడుపులోని చెడు బ్యాక్టీరియా పెరిగి అజీర్తి, చెడు బ్యాక్టీరియా పెరిగి అనారోగ్య పాలవుతారు. యాపిల్ తిన్న వెంటనే నీరుని కూడా తాగకూడదట. ఎందుకంటే యాపిల్ తిన్న వెంటనే నీరు త్రాగటం వలన కడుపులోని ఆమ్లాలను పలచన చేస్తుంది.. దీని వలన జీర్ణ సమస్యలు పెరుగుతాయి.