బీపీ పేషెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన యాపిల్ వెనిగర్. ఎందుకంటే..?
ఆపిల్ సైడర్ వెనిగర్ 10,000 సంవత్సరాలు ముందు నుంచి ఉన్న ఒకే ఒక్క అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు ఆనాటి నుంచి ఈ రోజు వరుకు దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ లో పొటాషియం, మెగ్నీషియం వంటి ఎసెన్షియల్ మినరల్స్ ఉన్నాయి. హైబీపీ రావడానికి కల కారణాల్లో పొటాషియం, మెగ్నీషియం లెవెల్స్ తక్కువగా ఉండడం కూడా ఒకటి. పొటాషియం తగ్గితే బ్లడ్ లో సోడియం పెరుగుతుంది, తద్వారా బీపీ పెరుగుతుంది.
మెగ్నీషియం బ్లడ్ వెసెల్స్ ని రిలాక్స్ చేసి బ్లడ్ ప్రెసర్ కంట్రోల్ లో ఉంచుతుంది. రోజుకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకూ యాపిల్ సైడర్ వెనిగర్ ని తీసుకోవచ్చు. దీన్ని రోజు మొత్తం మీద కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు. మీకు అసలు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం అలవాటు లేకపోతే రోజుకి ఒక టీ స్పూన్ తో మొదలు పెట్టి స్లోగా రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకూ వెళ్ళండి. దీనిని ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
ఒక టేబుల్ స్పూన్ రా, అన్ ఫిల్టర్డ్ యాపిల్ సైడర్ వెనిగర్ ని ఒక గ్లాసు లో వేయండి. దానిని మంచి నీరు తో కానీ, ఫ్రూట్ జ్యూస్ తో కానీ మీ ఇష్టప్రకారం కలిపి తీసుకోండి . ప్రతి మెయిన్ మీల్ ముందూ ఇలా తీసుకోండి. దీని వల్ల ఫుడ్ త్వరగా అరుగుతుంది, ఆకలి కంట్రోల్ లో ఉంటుంది.వేయించిన పాప్ కార్న్ కి ,స్మూతీలో కూడా కలుపుకోవచ్చు.
అయితే, ఇందుకోసం ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ నే వాడండి. అలాగే, యాపిల్ సైడర్ వెనిగర్ ని ఎక్కువ తీసుకుంటే అది పంటి మీద ఎనామిల్ కి మంచిది కాదని గమనించండి.యాపిల్ సైడర్ వెనిగర్ హైబీపీ ని తగ్గించినా పూర్తిగా దాని మీదే ఆధారపడడం కూడా మంచిది కాదు. డాక్టర్ చెప్పిన మందులు వాడుతూ వారి సలహాలు సూచనలునీ ఫాలో అవ్వడం అవసరం.