News

సిల్క్ స్మిత సగం తిన్న యాపిల్‌ వేలం వేస్తె ఎంతకు కొన్నారో తెల్సా..?

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో కొవ్వలి లో పుట్టిన సిల్క్ స్మిత కేవలం నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయడానికి ప్రయత్నించడంతో చివరికి ఇంటి నుంచి పారిపోయి మద్రాస్ వచ్చేసింది. ఈ క్రమంలోనే వడ్లపట్ల విజయలక్ష్మి కాస్త ఇండస్ట్రీకి వచ్చి సిల్క్ స్మిత గా ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమాల్లో వెలిగిపోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న సిల్క్ స్మిత అనుకున్నది సాధించింది. అయితే కళ్లలో మత్తు.. కళ్లు తిప్పలేని సౌంధర్యం.

ఆమె కేవలం ఐటమ్ భామ మాత్రమే కాదు ఆమె కుర్రాళ్ల మనసుల్ని ఏలిన లేడీ సూపర్ స్టార్. ఆమె ఒక్క పాటలో నర్తించిందని తెలిస్తే.. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే. తెలుగు తెరపై పేలిన బ్యూటీ బాంబ్ సిల్క్ స్మిత. ఒకటిన్నర దశాబ్దం పైగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత.. అర్థాంతరంగా తనువు చాలించారు. సిల్క్ స్మిత అసలు వడ్లపట్ల విజయలక్ష్మి. ఆంధ్రాలోని ఏలూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి. 1960 డిసెంబర్ 2న దెందులూరు మండలం కొవ్వలిలో పుట్టిన పుట్టిన సిల్క్ స్మిత.. నాల్గవ తరగతి వరకే చదువుకుంది. 15 ఏళ్లకే ఆమె పెళ్లి చేసేశారు.

అత్తింటి వేధింపులు భరించలేక.. ఆమె మద్రాసు పారిపోయింది. అక్కడ టచప్ ఆర్టిస్ట్‌గా కొన్నాళ్లు పనిచేసింది. తర్వాత సినిమాల్లో చిన్న, చిన్న రోల్స్ చేస్తోన్న ఆమెను.. ‘ఇనయే తేడి’ సినిమాతో మలయాళం డైరెక్టర్ ఆంథోనీ ఈస్ట్ మన్ హీరోయిన్ చేశాడు. ఆ తర్వాత ఆమె నటించిన తమిళ చిత్రం.. ‘వండిచక్రం’ మంచి హిట్ అయింది. విజయలక్ష్మి కాస్తా.. సిల్క్ స్మితగా మారిపోయింది. జయమాలిని, జ్యోతిలక్ష్మి వంటివారు సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తోన్న సమయంలో.. శృంగార రసాధిదేవతగా దూసుకొచ్చింది సిల్క్ స్మిత.

ఆ తర్వాత అందరు టాప్ హీరోలతో ఆడిపాడింది. ఒకానొక సమయంలో హీరోలతో సమానమైన రెమ్యూనరేషన్ తీసుకుంది. సిల్క్ ఉందంటే చాలు.. ఎడ్లబండి కట్టుకుని మరీ సినిమాలుకు వెళ్లేవారు యువకులు. సిల్క్‌ అందాన్ని ఆరాధించే భక్తులు పెరిగిపోయారు. అప్పట్లో ఫోన్స్ గట్రా లేవు కాబట్టి.. సినిమా తారల ఆగోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఎగబడేవారు. అందుకు విభిన్నంగా.. ఒక కిళ్ళీ తెచ్చుకొని ఆమెను కొరికి ఇమ్మని తమిళ ఫ్యాన్స్ బ్రతిమాలుకునేవారు.

1984 లో ఒక సారి షూట్ బ్రేక్‌లో సిల్క్ స్మిత యాపిల్ తింటూ ఉండగా షాట్ రెడీ అని చెప్పి ఆమెను పిలిచారట. సిల్క్ సగం తిన్న యాపిల్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయారట. ఆ కొరికిన యాపిల్‌ను ఆమె మేకప్ మన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్ళు పోటీపడి 26 వేలకు కొనుక్కున్నారట. అప్పట్లో 26 వేలు అంటే మాటలా. అది సిల్క్ స్మితకు ఉన్న డిమాండ్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker