Health

ప్రతి రోజు ఆపిల్ తినడం మంచిదే, ఏ సమయంలో తినాలో తెలుసుకోండి.

ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. అయితే రోజుకు ఒక ఆపిల్‌ తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఇది తింటే వైద్యుని వద్దకు పోనవసరం ఉండదు అంటుంటారు. అందుకని రోజూ ఒక ఆపిల్‌ కొనుగోలు చేసి మరీ తింటుంటారు. కానీ జీర్ణంకాక ఇబ్బందులు పడుతుంటారు. ఆపిల్‌ ఎప్పుడు తినాలి.

ఎప్పుడు తినకూడదు తెలుసుకుంటే చాలు అనారోగ్యం అన్న పేరు కూడా దరిదాపుల్లో ఉండదు. ప్రతిరోజూ ఆపిల్‌ తింటే వైద్యునితో పని ఉండదు అంటారు అది ముమ్మాటికీ సరైనది. అయితే ఆ తినే ఆపిల్‌ ఏ సమయంలో తినాలో కూడా తెలుసుకోవాలి. లేదంటే వైద్యుడిని కలవకుండా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లన్నింటిలో కంటే ఎక్కువ పోషకాలు యాపిల్‌లోనే ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

యాపిల్‌ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయన పదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని పరిశోధనలో కూడా తేలింది. ఆపిల్‌లో అధిక మొత్తంలో విటమిన్స్‌ అండ్‌ మినరల్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని మరింత పటిష్టం చేస్తాయి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అయితే ఆపిల్‌ ఏ టైంలో తింటే ఎక్కువ బెనెఫిట్స్‌ పొందవచ్చు అన్నది తెలుసుకోవాలి. యాపిల్‌ని పగటిపూట తినడం చాలా మంచిదని చెబుతున్నారు.

ఎందుకంటే యాపిల్‌కలోని పెక్టిన్‌, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. రాత్రి సమయంలో తింటే ఇవి త్వరగా జీర్ణం కావు. దీంతో జీర్ణసమస్యలు వస్తాయి. అలా కాకుండా పగటిపూట తింటే ఏవేవో పనులు చేస్తుంటాం. కాబట్టి పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. అందుకే యాపిల్స్‌ని పగటిపూట తినాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ యాపిల్‌ తినడం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. చర్మ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు, వంటి పలురకాల సమస్యలకు ఆపిల్‌ చక్కని ఔషధం. ఆపిల్స్‌లో దంతాలు పుచ్చిపోకుండా నిరోధించే జీవరసాయనాలు ఉన్నాయి. ఆపిల్‌సను అనునిత్యం తీసుకునే వారిలో దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి. అందుకే రోజూ పగటిపూట కనీసం ఒక ఆపిల్‌ ఖచ్చితంగా తినండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker