ఏపీలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందా..? అలెర్ట్ అయిన ప్రభుత్వం.

ఏపీలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందా..? అలెర్ట్ అయిన ప్రభుత్వం.

భారతదేశంలో కరోనా ఉధృతి ఇంకా విజృంభిస్తోంది. మొదటి వేవ్ దాటి సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతున్నా..ఆందోళన మాత్రం నెలకొంది. సెకండ్ వేవ్ నుంచి కోలుకోకముందే…థర్డ్ వేవ్ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయితే క‌రోనా సెకండ్ వేవ్ కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌గానే థ‌ర్డ్ వేవ్ టెన్ష‌న్ మొద‌లైంది.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల పైనే ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్ప‌డు తిరుప‌తిలో 29 మంది పిల్ల‌లు క‌రోనా బారిన‌ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే 9 మంది పిల్ల‌లు కోవిడ్ బారిన‌ప‌డ్డారు. అంతే కాకుండా క‌రోనా బారినప‌డ్డ పిల్ల‌లంద‌రూ కూడా ప‌దేళ్ల‌లోపు వారే.

ప్ర‌స్తుతం వీరు తిరుప‌తిలోని రుయా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రించ‌డం ఇప్పుడు 29 మంది పిల్ల‌లకు క‌రోనా రావ‌డంతో త‌ల్లి దండ్రుల్లో ఆందోళ‌న మొద‌లైంది. ప్ర‌స్తుతం ఈ 29మంది పిల్ల‌ల కోసం రుయా ఆస్ప‌త్రిలో ప్ర‌త్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *