ఈమె అచ్చం అనుపమ లాగే ఉంది, ఆమె ఎవరో తెలుసా..?
అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18 న పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది. ఈమె ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత కొట్టాయం సి.ఎం.ఎస్. కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రధాన విషయంగా ఉన్నతవిద్యను అభ్యసించింది. అయితే ఈ మద్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనుపమ పరమేశ్వరన్ ఫొటోలో కనిపిస్తున్నాయి. టిల్లు గాడితో రొమాన్స్ చేసి కుర్రాళ్ళ ఫీజులు అవుట్ చేసేసింది ఈ ముద్దుగుమ్మ.
అయితే తాజాగా అచ్చం అనుపమ లాగే ఉన్న ఓ లేడీ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్ తల్లి. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించే అనుపమ.. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతూ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అనుపమ, ఆమె తల్లిని చూస్తుంటే ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ పిక్స్ చూసి నెటిజన్లు పెడుతున్న కామెంట్స్ ఫన్నీగా ఉన్నాయి. అత్తా నీ కూతురు జాగ్రత్త అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అయింది అనుపమ పరమేశ్వరన్. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.
ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రేమమ్ అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది అనుపమ. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’లో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.